వేడుకలు నిర్వహించడం సరికాదు: కేసీఆర్ | IIFA Utsavam in solidarity with the people of chennai management decides to postpone the mega event | Sakshi
Sakshi News home page

వేడుకలు నిర్వహించడం సరికాదు: కేసీఆర్

Published Thu, Dec 3 2015 3:28 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

వేడుకలు నిర్వహించడం సరికాదు: కేసీఆర్ - Sakshi

వేడుకలు నిర్వహించడం సరికాదు: కేసీఆర్

హైదరాబాద్ : హైదరాబాద్లో శుక్రవారం నుంచి నిర్వహించాల్సిన ఐఫా అవార్డుల వేడుకలను వాయిదా వేయాలని ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖరరావు గురువారం ఆదేశించారు. భారీ వర్షాలతో చెన్నై సహా పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయిన సమయంలో వేడుకలు నిర్వహించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ (ఐఫా) అవార్డుల వేడుక ఇప్పటి వరకు బాలీవుడ్‌లో మాత్రమే జరిగేది. మొదటిసారి సౌత్‌ ఇండియా సినిమాలను రిప్రజెంట్‌ చేస్తూ ఈ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు.

అయితే చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రేపటి నుంచి మూడు రోజులపాటు జరగాల్సిన ఐఫా ఉత్సవాలను జనవరికి వాయిదా వేశారు. జనవరిలో జరిగే వేడుకల  చెన్నైకి విరాళాలు సేకరించాలని భావిస్తున్నట్లు ఐఫా వేడుక నిర్వాహకులు తెలిపారు. సౌత్‌ ఇండియా సినీ ఇండస్ట్రీ మొత్తం చెన్నైకి అండగా ఉండాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement