iifa utsavam
-
ఐఫా-2024 ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మెరిసిన సినీతారలు (ఫొటోలు)
-
ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: ఐఫా ఉత్సవాల్లో భాగంగా బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని టీ-హబ్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన స్వరమాత్రికుడు ఏఆర్ రెహమాన్.. తెలంగాణ సర్కారును ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'క్రియేటివిటీ ఇన్ ఇన్నోవేషన్' అనే అంశంపై జరిగిన ప్యానల్ డిస్కషన్లో రెహమాన్, సౌండ్ డిజైనర్ రసూల్ పోకుట్టి, తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్లు పాల్గొన్నారు. నిర్దేశిత అంశంపై దాదాపు గంటపాటు సాగిన డిస్కషన్లో రెహమాన్, రసూల్‌లు అనేక విషయాలు చెప్పుకొచ్చారు. రెహమాన్ మాట్లాడుతూ.. 'ఇది(టీ-హబ్) గవర్నమెంట్ బిల్డింగ్ కదా.. చాలా బాగుంది. ఇక్కడి గవర్నమెంట్ కూడా నాకు బాగా నచ్చింది'అని ప్రశంసించారు. అటుపై తన కెరీర్ ప్రారంభాన్ని గుర్తుచేసుకుంటూ.. సంగీతమే జీవితం అవుతుందని తానెప్పుడూ అనుకోలేదని చెప్పారు. 'సంగీతం కోసమే నేను పుట్టానన్న విషయం నాకెప్పుడూ తెలియదు. కానీ మా అమ్మ మాత్రం దాన్ని బలంగా నమ్మింది. ఏనాటికైనా నేనొక మంచి సంగీతకారుణ్ని అవుతానని ఆమె విశ్వసించింది. కెరీర్ ప్రారంభంలో.. సంగీత పరికరాలు, సరంజామా ఏదీ లేని నా రికార్డింగ్ రూమ్‌లో కూర్చొని.. ఎప్పటికైనా ఈ గదినిండా సంగీత పరికరాలు నిండిపోవాలని అనుకునేవాణ్ని' అని రెహమాన్ చెప్పారు. '1986 తర్వాత బయటి సంగీత దర్శకుల దగ్గర పని చేయడం మానేసి, సొంతగా ప్రాక్టీస్ మొదలుపెట్టా. నిరంతరం నేర్చుకోవడం, సాధన చేయడమే సంగీత రంగంలో అసలైన పెట్టుబడి. అవకాశాల గురించి ఆలోచించకుండా సాధనపైనే దృష్టిపెట్టా. మనం ఎంత సమర్థులమైతే మన దగ్గరికి అంతమంది వస్తారు. ఆ తర్వాత మన స్థాయిని ఇంకాస్త మెరుగుపర్చుకోవాలి. మరింత ఉత్సాహాన్ని నింపుకోవాలి. అప్పుడు వెనకబడిపోవటం అనేది జరగదు' అని రెహమాన్ సందేశం ఇచ్చారు. రసూల్ పోకుట్టి మాట్లాడుతూ 'సౌండ్ మిక్సింగ్ అనేది కూడా ఓ కళేనని నాకు అవార్డు ('స్లమ్‌డాగ్ మిలియనీర్'కు) వచ్చేదాకా చాలా మందికి అర్థం కాలేదు. సౌండ్ మిక్సింగ్‌లో ఆసియా వాసికి ఆస్కార్ రావడానికి 81 ఏళ్లు పట్టిందటేనే అర్థం చేసుకోవచ్చు.. దానిపై మనకున్న అవగాహన ఏమిటో! మనం ఏం చదివామనేది కాకుండా ఎంత నేర్చుకున్నాం అనేదానిపైనే నిలదొక్కుకోగలం'అని అన్నారు. -
వివాదాలపై తొలిసారి నోరు విప్పిన అనిరుధ్
ఐఫా (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) ఉత్సవం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రెండు రోజులు జరుగనున్న ఈ వేడుకలో మొదటిరోజు ఆదివారం తమిళ, మలయాళ కళాకారులకు అవార్డులను అందజేశారు. ఈ వేడుకలో ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్, సమంత జంటగా నటించిన 'కత్తి' సినిమాకి అందించిన సంగీతానికిగాను ఉత్తమ సంగీత దర్శకుడిగా అనిరుధ్ ఎంపికయ్యారు. డిసెంబర్ నెలలో 'బీప్' సాంగ్ పై వివాదం చెలరేగినప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉన్న యువ సంగీత దర్శకుడు అనిరుధ్ తొలిసారి ఐఫా వేదికపై నోరు విప్పాడు. ఉత్తమ సంగీత దర్శకుడిగా ఐఫా పురస్కారాన్ని అందుకుంటూ అనిరుధ్.. 'సాధారణంగా నేను స్టేజ్ మీద మాట్లాడను, కానీ ఈరోజు మాట్లాడతాను. కొలవెరి ఢీ పాట సమయం నుంచే నాకు ఇబ్బందులు మొదలయ్యాయి. కత్తి మూవీ రిలీజ్ టైంలో కూడా చాలా వివాదాలను ఎదుర్కొన్నాను. చివరిగా నేను నేర్చుకున్నదేంటంటే.. వివాదాలను అస్సలు లెక్క చేయకూడదు, మనం పని మీద మాత్రమే శ్రద్ధ పెట్టాలి. గత నాలుగేళ్లుగా నన్నెంతో ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు, ఈ నాలుగేళ్లలో 11 సినిమాలకు సంగీతం అందించాను. ఒక్కటి మాత్రం నేను కచ్చితంగా చెప్పగలను.. బాధ లేకుండా విజయం ఉండదు' అంటూ ముగించాడు ఈ యువ తరంగం. మహిళలను కించపరిచే పదజాలంతో పాడిన 'బీప్' సాంగ్ వివాదంలో తమిళ హీరో శింబు, సంగీత దర్శకుడు అనిరుధ్ లపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని వారాల తర్వాత అనిరుధ్ మాట్లాడటం సినీ సర్కిల్స్ లో ఆసక్తి కలిగించింది. -
రెండు రోజులు... ఐ-ఫీస్ట్
-
రెండు రోజులు... ఐ-ఫీస్ట్
‘‘పువ్వల్లే నవ్వుల్.. నవ్వుల్...’’ అంటూ సిల్వర్ స్క్రీన్‌పై శ్రీయ నర్తిస్తుంటే కళ్లప్పగించి చూసేస్తాం.. ‘‘ఏం సక్కగున్నావ్రో నా సొట్ట సెంపలోడ’’ అంటూ తాప్సీ డ్యాన్స్ చూస్తే అదో ఐ-ఫీస్ట్... తెరపై వీళ్ల డ్యాన్స్ చూసినప్పుడే పసందుగా ఉంటే, ఇక డెరైక్ట్‌గా స్టేజిపై డ్యాన్స్ చేస్తేచూడ్డానికి రెండు కళ్లూ చాలవు. శ్రీయ, తాప్సీ, నిక్కీ గల్రానీ.. ఇలా భాషాభేదం లేకుండా పలువురు కథానాయికలు కనువిందు చేయబోతున్న వేడుక ‘ఐఫా- ఉత్సవమ్’. జియోవన్ స్మార్ట్‌ఫోన్, రేనాల్ట్‌ల సహ సమర్పణలో ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఈ ‘ఐఫా-ఉత్సవమ్’ను అందిస్తోంది. దశాబ్దన్నర పైగా కేవలం హిందీ చలనచిత్ర పరిశ్రమకే ఈ అవార్డులు పరిమితమయ్యాయి. ఈ ఏడాది తొలిసారిగా దక్షిణాది సినిమాలకు అవార్డులివ్వాలని ‘ఐఫా’ నిర్వాహకులు నిర్ణయించుకున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో జరగనున్న ఈ వేడుకల్లో పలువురు ప్రముఖ తారలు తమ నృత్యాలతో అలరించనున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో మమతా మోహన్‌దాస్, శ్రీయ, తాప్సీ, నిక్కీ గల్రానీ, పారుల్ యాదవ్ బిజీ బిజీగా రిహార్సల్స్ చేస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నృత్య కళాకారుడు షియామక్ దావర్ ఆధ్వర్యంలో డ్యాన్స్ ప్రాక్టీస్ జరుగుతోంది. ప్రాక్టీస్ బ్రేక్‌లో ‘సాక్షి’తో తారలు ముచ్చటించారు. ఆ విశేషాలు... ఈ వేడుక నాకు చాలా ప్రత్యేకం - శ్రీయ ‘‘దక్షిణాదివారికి ఐఫా అవార్డులు ఇవ్వడం ఇదే మొదటిసారి. సౌతిండియాలోనే పెద్ద వేడుక ఇది. అదో ఆనందం అయితే ఈ వేడుక హైదరా బాద్‌లో జరగడం మరో ఆనందం. ఈ వేడుక నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే, ప్రభుదేవాతో కలిసి 45 సెకన్ల పాటు డ్యాన్స్ చేయబోతున్నాను. అంత టాలెంటెడ్ డ్యాన్సర్‌తో స్టేజ్ షేర్ చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. గతంలో నేను షియామక్ దావర్ దగ్గర డ్యాన్స్ క్లాసులకు వెళ్లేదాన్ని. ఇప్పుడీ వేడుకలకు ఆయన దగ్గర మళ్లీ నేర్చుకోవడం ఓ మంచి అనుభూతి. ఆయన ట్రెడిషనల్ బుక్స్ చదువుతుంటారు. నాక్కూడా ఇస్తుంటారు. నేను డ్యాన్స్ చేయబోయే పాటల్లో ‘వాజి... వాజి... వాజి.. శివాజీ’, ‘మన్మథ.. మన్మథ...’ మొదలైన సూపర్ హిట్స్ ఉన్నాయి. నాతో డ్యాన్స్ చేయనుంది నా టీచర్లే! - తాప్సీ ఈ వేడుక గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అంత ఎగ్జయిటింగ్‌గా ఉంది. నేను సినిమాల్లో బాగా డ్యాన్స్ చేస్తున్నానంటే షియామక్ దావర్ కారణం. ఆయన దగ్గర ఆరేళ్లు ట్రైనింగ్ తీసుకున్నాను. ఇప్పుడీ వేడుకలో నా వెనకాల గ్రూప్ డ్యాన్స్ చేసేవాళ్లందరూ నా టీచర్లే కావడం విశేషం. నా గురువులకూ, ఐఫాకీ గర్వకారణంగా నిలిచేలా డ్యాన్స్ చేయాలనుకుంటున్నాను. ఎంతోమంది ప్రముఖులు పాల్గొననున్న ఈ వేడుక నాకు మరపురాని అనుభూతి అవుతుంది. హేమాహేమీలతో డ్యాన్స్ చేయనున్నా - నిక్కీ గల్రానీ ఇప్పటివరకూ మలయాళంలో నాలుగు, కన్నడంలో నాలుగు, తమిళంలో రెండు సినిమాల్లో నటించాను. ప్రస్తుతం తెలుగులో ‘కృష్ణాష్టమి’ సినిమా చేస్తున్నాను. ఈ వేదికపై డ్యాన్స్ చేయబోతున్నవాళ్లందరూ హేమాహేమీలే. వాళ్లతో కలిసి డ్యాన్స్ చేయనుండటం నాకో అందమైన కల నెరవేరినట్లుగా ఉంటుంది. మొత్తం నాలుగు పాటలకు డ్యాన్స్ చేయబోతున్నాను. నా చిన్నప్పుడు షియామక్ దావర్ గురించి చెబుతుంటే వినేదాన్ని. ఆయన కొరియోగ్రఫీలో డ్యాన్స్ చేయడం ఆనందంగా ఉంది. -
చెన్నై వరదల దెబ్బ...ఐఫా- ఉత్సవమ్ వాయిదా
తమిళనాడును, ముఖ్యంగా చెన్నై నగరాన్ని ముంచెత్తిన వానలు, వరదల దెబ్బ సినిమా కార్యక్రమాల మీద కూడా ప్రభావం చూపింది. ఈ శుక్రవారం నుంచి ఆదివారం దాకా మూడు రోజుల పాటు జరగాల్సిన దక్షిణ భారత సినిమా అవార్డుల వేడుక ‘ఐఫా - ఉత్సవమ్’ నిరవధికంగా వాయిదా పడింది. జల విలయంలో ఇరుక్కొని, తీవ్ర కష్టనష్టాల్లో ఉన్న చెన్నై ప్రజలకు సంఘీభావంగా ఈ సినిమా వేడుకను వాయిదా వేయాలని ‘ఐఫా - ఉత్సవమ్’ కార్యనిర్వాహక బృందం నిర్ణయించింది. చెన్నై ప్రజలకు సినీ సంఘీభావం నిజానికి, దాదాపు దశాబ్దిన్నరగా కేవలం హిందీ చిత్ర పరిశ్రమకే పరిమితమైన ‘ఐఫా’ ఉత్సవాన్ని దక్షిణాదికి విస్తరింపజేయడం ఇదే తొలిసారి. దక్షిణాది సినీ పరిశ్రమలకు సంబంధించిన అవార్డుల ప్రదానోత్సవంగా తొలిసారి తలపెట్టిన ఈ ‘ఐఫా-ఉత్సవమ్’ ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరగాల్సి ఉంది. అయితే, తమిళనాట వరదల్లో భారీగా జన నష్టం, ఆస్తి నష్టం సంభవించి, లక్షల మంది నిరాశ్రయులు కావడంతో దక్షిణాది సినీ పరిశ్రమ పెద్దలతో సహా సంబంధీకులు అందరితో చర్చించి, ఉత్సవాన్ని నిరవధికంగా వాయిదా వేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ‘ఐఫా’ (ఐ.ఐ.ఎఫ్.ఎ) మేనేజ్మెంట్ పక్షాన ఈ అవార్డులు నిర్వహిస్తున్న ‘విజ్‌క్రాఫ్ట్ ఇంటర్నేషనల్’ ఫౌండర్ - డెరైక్టర్ ఆండ్రూ టిమ్మిన్స్ బుధవారం ఈ సంగతి పత్రికాముఖంగా ప్రకటించారు. బాధితులకు విరాళాల సేకరణతో వచ్చే జనవరిలో! రానున్న కొత్త సంవత్సరం జనవరిలో ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని ప్రస్తుతానికి భావిస్తున్నారు. చెన్నై నగరానికి అండగా నిలిచే రీతిలో భారీయెత్తున విరాళాల సేకరణను కూడా కలుపుకొని ఈ రాబోయే ఉత్సవాన్ని జరపాలని యోచిస్తున్నారు. ‘‘చెన్నైలోని వరద బీభత్సం మా మనసును కలచివేసింది. ఈ విషాదం నుంచి అందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. సినీ పరిశ్రమలోని వారందరితో కలసి ఇవాళ చెన్నై నగరంలోని బాధితులకు పూర్తిగా మద్దతుగా నిలుస్తున్నాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమవాళ్ళందరం కలసి ‘ఐఫా -ఉత్సవమ్’ను తుపాను బాధితులకు ఫండ్ రైజర్‌గా నిర్వహిస్తాం’’ అని ఆండ్రూ టిమ్మిన్స్ పేర్కొన్నారు. -
వేడుకలు నిర్వహించడం సరికాదు: కేసీఆర్
హైదరాబాద్ : హైదరాబాద్‌లో శుక్రవారం నుంచి నిర్వహించాల్సిన ఐఫా అవార్డుల వేడుకలను వాయిదా వేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గురువారం ఆదేశించారు. భారీ వర్షాలతో చెన్నై సహా పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయిన సమయంలో వేడుకలు నిర్వహించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) అవార్డుల వేడుక ఇప్పటి వరకు బాలీవుడ్లో మాత్రమే జరిగేది. మొదటిసారి సౌత్ ఇండియా సినిమాలను రిప్రజెంట్ చేస్తూ ఈ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు. అయితే చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రేపటి నుంచి మూడు రోజులపాటు జరగాల్సిన ఐఫా ఉత్సవాలను జనవరికి వాయిదా వేశారు. జనవరిలో జరిగే వేడుకల చెన్నైకి విరాళాలు సేకరించాలని భావిస్తున్నట్లు ఐఫా వేడుక నిర్వాహకులు తెలిపారు. సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీ మొత్తం చెన్నైకి అండగా ఉండాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.