
ఖైరతాబాద్: ‘చిన్న సినిమాలను ఆదరిద్దాం.. నా వంతుగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో పాటు ‘‘రచయిత’’ సినిమాను నేను దత్తత తీసుకున్నా’ని నటుడు జగపతిబాబు అన్నారు. మంగళవారం ఐమాక్స్ ఎదురుగా ఉన్న లేక్‌వ్యూ పార్క్‌లో రచయిత సినిమా పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడుతూ.. 30 సంవత్సరాలుగా అనేక సినిమాలు చేశానన్నారు. రచయిత సినిమాను దత్తత తీసుకొని రెండు రోజులుగా వైజాగ్, విజయవాడల్లో నడక పూర్తిచేసి హైదరాబాద్‌లో సినిమా పోస్టర్‌ను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు.
పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి సినిమాలు సూపర్ హిట్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కొన్ని మంచి సినిమాలు కూడా కనిపించకుండా పోయాయని, దానికి పబ్లిసిటీ లేక, థియేటర్లు దొరకక, ఎవ్వరూ కొనక వంటి కారణాలు అయి ఉండవచ్చన్నారు. చిన్న సినిమాలను కాపాడాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తి లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment