ప్రయాణంలో... జత కలిసే | jatha kalise movie audio released | Sakshi
Sakshi News home page

ప్రయాణంలో... జత కలిసే

Published Mon, Dec 14 2015 11:59 PM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

ప్రయాణంలో...   జత కలిసే - Sakshi

ప్రయాణంలో... జత కలిసే

 ఒక అమ్మాయి, అబ్బాయి... కారులో ఒక్క రోజు ప్రయాణం. ఇంకేముంది? ఇద్దరి మనసులు కలిశాయి. ప్రేమలో పడ్డారు. ఆ ప్రయాణం వారి జీవి తాల్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత ఏమైంది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘జత కలిసే’. ‘రాజుగారి గది’ ఫేమ్ అశ్విన్, తేజస్విని జంటగా యుక్త క్రియేషన్స్ పతాకంపై రాకేశ్  శశి దర్శకత్వంలో నరేశ్ రావూరి నిర్మించిన ఈ చిత్రానికి సాయికార్తీక్ స్వరాలందించారు. ఈ చిత్రం పాటలను దర్శకుడు రాజమౌళి ఆవిష్కరిం చారు.
 
  అనంతరం ఆయన మాట్లాడుతూ -‘‘ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇలాంటి మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘సరదాగా సాగిపోయే రోడ్ జర్నీ ఇది. నా ఫస్ట్ సినిమా వారాహి బ్యానర్‌లో విడుదల కావడం ఆనందంగా ఉంది. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా ఇది’’ అని అన్నారు. ఈ వేడుకలో సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి, దర్శకుడు ఓంకార్, నిర్మాతలు అనిల్ సుంకర, సాయి కొర్రపాటి, హీరో అశ్విన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement