సూపర్‌ స్టార్ల ఫన్నీ సంభాషణ ఎలా ఉందంటే... | John Cena SRK Funny Twitter Conversation | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 24 2017 1:58 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

John Cena SRK Funny Twitter Conversation - Sakshi

సాక్షి, సినిమా : బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌కు ఉన్న క్రేజ్‌ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస ఫ్లాపుల నేపథ్యంలో కూడా ఆయన ఎప్పటికప్పుడు తన సినిమాలకు మంచి వసూళ్లు(ఓపెనింగ్‌) రాబట్టడమే అందుకు నిదర్శనం. అయితే ఈ మధ్య కొత్త అవతారం ఎత్తి ఆయన టాక్‌ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. టెడ్‌ టాక్స్‌ నయి సోచ్‌ పేరిట ఆయన ఈ మధ్యే దానిని మొదలుపెట్టారు. 

భారత్‌లో ఈ షో ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలీదుగానీ.. విదేశాల్లో మాత్రం దీనిని ప్రేక్షకులు వీక్షిస్తున్నారనే తెలుస్తోంది. దీనికి నిదర్శనంగా డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌, నటుడు జాన్‌ సీనా తన తాజా ట్వీట్‌ నిదర్శనం. షారూఖ్‌ షోలో నిర్వహించిన థాట్స్‌ ఆన్‌ హ్యుమానిటీ, ఫేమ్‌ అండ్‌ లవ్‌ అనే అంశాన్ని సీనా తన ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశాడు.

దీనికి షారూఖ్‌ కూడా బదులు ఇచ్చారు. సీనాకు థాంక్స్‌​చెబుతునే.. (‘యూ కాంట్‌ టూ సీ మీ’ నిఉద్దేశిస్తూ) ఏదో రోజు నిన్ను చూస్తా అంటూ వ్యంగ్యపు రిప్లై ఇచ్చాడు. దానికి మళ్లీ సీనా మరో ఫన్నీ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఆ సంభాషణల ట్వీట్లు వైరల్‌ అవుతున్నాయి. ఈ మధ్య డబ్ల్యూడబ్ల్యూఈ సభ్యులు ఇండియా టూర్‌కి రాగా.. సీనా అది మిస్సయ్యాడు. తనకు ఇండియా అంటే ప్రత్యేకమైన అభిమానం అని గతంలో చాలా స్టార్లు అతను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ మధ్య ద్రావిడ్‌ పోస్ట్‌ ఒకదానిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement