
ఎన్టీఆర్, అభయ్‌రామ్
చేసే ప్రతీ అల్లరి పనిలో ఇద్దరికీ వాటా ఉంటుందట. ఎప్పుడూ జట్టుగానే ఉంటారట ఎన్టీఆర్, ఆయన కుమారుడు అభయ్‌రామ్. ఆదివారం అభయ్‌రామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘నాతో పాటు అల్లరి పనులు చేసే నా పార్ట్‌నర్ బర్త్‌డే ఇవాళ’ అంటూ తన కుమారుడితో దిగిన ఫొటోను షేర్ చేశారు ఎన్టీఆర్. ‘పార్ట్‌నర్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈరోజుతో వీడికి నాలుగు సంవత్సరాలు నిండుతాయి. అభయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారాయన. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు.
Comments
Please login to add a commentAdd a comment