
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ నెల 14న రెండోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఎన్టీఆర్ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచారు. ఇన్‌స్టాలో తొలి సారిగా తన ఇద్దరు కుమారుల ఫొటోను ఎన్టీఆర్ షేర్ చేశారు. అభయ్ తన చిన్ని తమ్ముడిని పట్టుకుని కూర్చీలో కూర్చుంటే ఎన్టీఆర్ వారిని తన ఫోన్‌లో బంధిస్తున్న.. ఫొటోను ఎన్టీఆర్ అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోను ప్రణతి తీశారని.. తను ఏ ఉద్ధేశంతో తీసిందో కూడా తెలియదని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటుంది. కానీ ఈ ఫొటోలో బాబు స్పష్టంగా కనబడకపోవడం అభిమానులను కాసింత నిరాశకు గురిచేసింది. రెండో సారి తండ్రి అయిన విషయాన్ని ‘నా కుటుంబం మరింత పెద్దదైంది. మగ బిడ్డ’ అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్.
Comments
Please login to add a commentAdd a comment