
‘ఈ సమయంలో నాన్న ఉంటే బాగుండేదని... నాకు తెలిసి నాన్న ఇక్కడే ఎక్కడో ఉండి చూస్తుంటారని, నాన్న లేకపోయినా నాన్న హోదాలో ఇక్కడకు వచ్చిన బాబాయ్ కు పాదాభివందనం చేస్తున్నాన’ని ఉద్వేగపూరితంగా ప్రసంగించారు జూనియర్ ఎన్టీఆర్. అరవింద సమేత విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి పై విధంగా ఎన్టీఆర్ మాట్లాడాడు. ఇంకా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఈ సినిమా విజయానికి మీ ఆశీస్సులు అందజేసినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.
ఈ సినిమా విజయాన్ని అభిమానులతోనే కాకుండా బాబాయ్‌తో కూడా పంచుకోవాలనుకుంటున్నానని అందుకే బాబాయ్‌ను ముఖ్య అతిథిగా పిలిచామని అన్నాడు. ఈ వేడుకలో తాను ఇంకా ఎక్కువ మాట్లాడితే బాగుండదని.. అభిమానులంతా బాబాయ్ మాటల కోసం ఎదురుచూస్తున్నారని అన్నాడు. జోహార్ ఎన్టీఆర్.. జై ఎన్టీఆర్.. జోహార్ హరికృష్ణ... జై హరికృష్ణ అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు.
Comments
Please login to add a commentAdd a comment