అరవింద సమేత బోల్డ్‌ స్టోరీ : రామ్‌ చరణ్‌ | Ram Charan Praises Aravinda Sametha Team | Sakshi
Sakshi News home page

అరవింద సమేత బోల్డ్‌ స్టోరీ : రామ్‌ చరణ్‌

Published Mon, Oct 15 2018 5:43 PM | Last Updated on Mon, Oct 15 2018 9:24 PM

Ram Charan Praises Aravinda Sametha Team - Sakshi

ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరవింద సమేత వీర రాఘవ’ ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ నట విశ్వరూపం ప్రదర్శించాడంటూ మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రశంసలు కురిపించాడు.

‘జూనియర్‌ ఎన్టీఆర్‌ కెరీర్‌లోని బెస్ట్‌ పెర్ఫామెన్స్‌లో ఒకటిగా ఈ క్యారెక్టర్‌ నిలిచిపోతుంది. బోల్డ్‌ స్టోరి. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌, పదునైన డైలాగ్స్ సూపర్బ్‌. జగ్గూ భాయి నటన, థమన్‌ సంగీతం ఈ సినిమా విజయానికి పిల్లర్లుగా నిలిచాయి. పూజా హెగ్డే కూడా చాలా బాగా నటించింది’  అంటూ అరవింద సమేత టీంకు రామ్‌ చరణ్‌ అభినందనలు తెలియజేశాడు. రామ్‌ చరణ్ సతీమణి ఉపాసన కూడా.. ‌‘నిజంగా అరవింద సమేత ఓ ఎమోషనల్‌ ట్రీట్‌’ అని ట్వీట్‌ చేస్తూ చెర్రీ పోస్టును షేర్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement