బంద్లను బంద్ చేయాలన్న కాజల్ | kajal agarwal asks to stop political bundhs | Sakshi
Sakshi News home page

బంద్లను బంద్ చేయాలన్న కాజల్

Published Sat, May 31 2014 1:54 PM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

బంద్లను బంద్ చేయాలన్న కాజల్ - Sakshi

బంద్లను బంద్ చేయాలన్న కాజల్

భవిష్యత్తులో ఇక రాజకీయ బంద్లను బంద్ చేయాలని టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెప్పింది. వీటివల్ల సమయం వృథా కావడంతో పాటు ప్రభుత్వాలకు ఆదాయం కూడా తగ్గిపోవడం తప్ప మరేమీ ఉపయోగం ఉండబోదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తాజాగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ఆర్డినెన్సుకు నిరసనగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా గురువారం నాడు బంద్ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ ట్వీట్ చేసింది.

టాలీవుడ్ హీరోయిన్లలో ఎక్కువగా సమంతా మాత్రమే ట్విట్టర్ వ్యాఖ్యలకు బాగా ఫేమస్. అడపాదడపా ఆమె చిక్కుల్లో కూడా పడింది. ఇప్పుడు కాజల్ చేసిన కొత్త ట్వీట్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement