ఉత్తమ విలన్‌తో జోడీ? | Kajal Agarwal ,Tamanna and Trisha to romance with uthama villain | Sakshi
Sakshi News home page

ఉత్తమ విలన్‌తో జోడీ?

Published Wed, Feb 12 2014 11:30 PM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

ఉత్తమ విలన్‌తో జోడీ? - Sakshi

ఉత్తమ విలన్‌తో జోడీ?

కమల్‌హాసన్ హీరోగా రమేష్ అరవింద్ దర్శకత్వంలో ‘ఉత్తమ విలన్’ పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. ఈ నెల 24న చెన్నయ్‌లో పూజాకార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో కమల్ టైటిల్ రోల్ పోషించనున్నారు. ఆయన గురువు, ప్రముఖ దర్శకుడు బాలచందర్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. ఇందులో కమల్ సరసన ముగ్గురు నాయికలు నటిస్తారని సమాచారం. ఈ పాత్రలకు త్రిష, తమన్నా, కాజల్ అగర్వాల్‌ని తీసుకోవాలనుకుంటున్నారని చెన్నై టాక్. ఇటీవల ఈ ముగ్గురు భామలతో సంప్రతింపులు జరిపారని వినికిడి. కమల్‌తో త్రిష ‘మన్మథన్ అంబు’ అనే చిత్రంలో నటించింది. కాబట్టి, మరోసారి గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందని ఊహించవచ్చు. కాజల్, తమన్నాకి కమల్‌తో ఇదే తొలి అవకాశం. అందుకని ఈ ఇద్దరు కూడా ఈ చిత్రంవైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. మరి.. ఉత్తమ విలన్‌కి ఈ ముగ్గురూ జోడీ అవుతారో లేదో వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement