అమ్మో! అయిదు కోట్లా!? | Kajol Demands 5 Crore for 'Dilwale' | Sakshi
Sakshi News home page

అమ్మో! అయిదు కోట్లా!?

Published Tue, Apr 14 2015 10:19 PM | Last Updated on Wed, Apr 3 2019 9:11 PM

అమ్మో! అయిదు కోట్లా!? - Sakshi

అమ్మో! అయిదు కోట్లా!?

 నటి కాజోల్ చాలాకాలం తరువాత మరోసారి వెండితెరపై మెరుస్తున్న సంగతి తెలిసిందే. అదీ... భారీ బడ్జెట్ చిత్రం ‘దిల్‌వాలే’ ద్వారా! అందులోనూ తనకు విజయవంతమైన జోడీ అయిన షారుఖ్ ఖాన్ సరసన!! రోహిత్‌షెట్టీ రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి తాజాగా మరో ఆసక్తికరమైన కబురు తెలిసింది. ఈ సినిమాకు కాజోల్ అందుకుంటున్న పారితోషికం అక్షరాలా రూ. 5 కోట్లట! ఒక ప్రముఖ ట్యాబ్లాయిడ్ ఈ సంగతి వెల్లడించింది.
 
 చాలా కాలంగా సినిమాల్లో కనిపించని కాజోల్ ఇప్పుడు ఈ చిత్రంతో ఏకంగా అగ్రశ్రేణి తారలు కరీనా కపూర్, కత్రినా కైఫ్‌ల స్థాయిలో అత్యధిక పారితోషికం అందుకోనుందన్న మాట! రానున్న జూన్ నుంచి ఈ చిత్రం కోసం షారుఖ్, కాజోల్‌లు షూటింగ్‌లో పాల్గొననున్నారు. గతంలో ‘బాజీగర్’, ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’, ‘కుఛ్ కుఛ్ హోతా హై’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ చిత్రాల్లో ఈ హిట్ జోడీ అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఈ వినోదాత్మక కుటుంబకథలో తెరపై మెరవనున్నారు.
 
  రోహిత్ షెట్టీతో పాటు షారుఖ్ భార్య గౌరీ ఖాన్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి. షారుఖ్, కాజోల్‌ల జోడీతో పాటు వరుణ్ ధావన్, కృతీ సనన్‌లు యువ జంట కూడా ఈ కథలోని కీలక పాత్రధారులు. చకచకా షూటింగ్ పూర్తి చేసి, ఈ ఏడాది క్రిస్‌మస్‌కు సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లు దర్శకుడు రోహిత్ షెట్టీ చెప్పారు. విడుదల లోగా మరెన్ని విశేషాలు బయటకొస్తాయో కానీ, ప్రస్తుతానికి పారితోషికం వ్యవహారంతో కాజోల్ అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement