
పాట చిత్రీకరణలో ‘ఎమ్మెల్యే’ టీం
నందమూరి హీరో కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎమ్మెల్యే. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సాంగ్ షూట్ అజర్‌బైజాన్‌లోని బాకు సిటీలో జరుగుతోంది. కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ లపై చిత్రీకరిస్తున్న డ్యూయట్ సాంగ్‌కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.
సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలందిస్తున్న సినిమాతో సక్సెస్‌పుల్ రచయిత ఉపేంద్ర మాదవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈసినిమాను బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై కిరణ్ రెడ్డి, భరత్ చౌదరిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్రహ్మానందం, మనాలీ రాథోడ్, రవికిషన్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment