
గీత... పేరు చాలా సన్నితంగా ఉంది. కానీ అనుకున్నంత సాఫ్ట్ కాదు ఈ అమ్మాయి. తేడా వస్తే రప్ఫాడిస్తుంది. గన్‌తో పేల్చి పడేస్తుంది. ఇంతకీ ఈ గీత క్యారెక్టర్ చేసినది ఎవరో కాదు ‘హలో’ ఫేమ్ కల్యాణి ప్రియదర్శన్. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో తన వంతు షూట్‌ను కంప్లీట్ చేశారు కల్యాణి.
‘‘శర్వానంద్ హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నా వంతు షూటింగ్‌ను కంప్లీట్ చేశాను. టీమ్‌తో కలిసి సెట్‌లో బాగా ఎంజాయ్ చేశాను. అలాగే గన్‌తో షూట్ చేయడం నేర్పించిన సుధీర్ వర్మకు స్పెషల్ థ్యాంక్స్’’ అన్నారు కల్యాణి ప్రియదర్శన్. ప్రస్తుతం మోహన్‌లాల్ మలయాళ చిత్రం ‘మరాక్కర్’లో ఓ కీలక పాత్ర చేయనున్న కల్యాణి తెలుగులో సాయిధరమ్ తేజ్ ‘చిత్రలహరి’లో కథానాయికగా ఎంపికైన సంగతి తెలిసిందే.