కమల్‌హాసన్‌కు అనుకోని ఆతిథ్యం
ముంబై: విలక్షణ నటుడు కమల్‌హాసన్‌కు అనుకోని రీతిలో ఆతిథ్యం లభించింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే.. కమల్‌ను ముంబైలోని కృష్టకుంజ్ నివాసంలోకి సాదరంగా స్వాగతించారు. రాజ్ ఠాక్రేతోపాటు ఆయన భార్య షర్మిల, కుమార్తె ఊర్వశి కూడా కమల్ తదితరులను ఆహ్వానించారు. వాళ్లకు మరాఠా సంప్రదాయ రీతిలో శాలువాలు, పూలు ఇచ్చారు. 61 ఏళ్ల కమల్ హాసన్‌కు బంగారు శాలువాను కప్పి ఠాక్రే ఘనంగా సత్కరించారు. ఆయన భార్య షర్మిల.. కమల్‌కు నమస్తే చెప్పగా, కుమార్తె ఊర్వశి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకుంది.
ఇది కేవలం మర్యాదపూర్వకమైన భేటీ మాత్రమేనని ఎంఎన్ఎస్ వర్గాలు చెబుతుండగా, బాలీవుడ్‌లో మాత్రం కమల్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ కథనాలు గుప్పుమన్నాయి. కొంతమంది బాలీవుడ్ జనాలు కూడా రాజకీయ కోణాన్ని కొట్టిపారేస్తున్నారు. అసలు కమల్ హాసన్ సహజ ప్రవృత్తికి ఇది పూర్తి భిన్నమన్నారు.