మరుదనాయగం మళ్లీ మొదలుపెడతా! | Kamal Hassan On 'Marudhanayagam' Release | Sakshi
Sakshi News home page

మరుదనాయగం మళ్లీ మొదలుపెడతా!

Published Sun, Nov 16 2014 11:16 PM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM

మరుదనాయగం మళ్లీ మొదలుపెడతా!

మరుదనాయగం మళ్లీ మొదలుపెడతా!

 గత కొన్నేళ్లుగా ఒకేసారి ఒక చిత్రం మాత్రమే చేస్తూ వచ్చిన కమల్‌హాసన్ ఇప్పుడు ఏకంగా విశ్వరూపం-2, పాపనాశం, ఉత్తమ విలన్.. ఈ మూడు చిత్రాలూ చేశారు. మరో ఆరు నెలల్లో ఒకదాని తర్వాత ఒకటి ఈ మూడు చిత్రాలూ విడుదలవుతాయి. ఈ నేపథ్యంలో తదుపరి ‘టిప్పు సుల్తాన్’ అనే చిత్రం చేయాలనుకుంటున్నారు. అలాగే, తన కలల చిత్రం ‘మరుదనాయగమ్’ని మళ్లీ మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఇటీవల ఓ సందర్భంలో కమల్ ఈ విషయం గురించి చెబుతూ - ‘‘‘మరుదనాయగమ్’వంటి చిత్రం చేయడానికి డబ్బులు మాత్రమే కాదు.. చాలా సమకూరాలి. ముఖ్యంగా పంపిణీరంగం నుంచి సహకారం కావాలి.
 
 ఈ చిత్రాన్ని తమిళ్, ఇంగ్లిష్, ఫ్రెంచ్ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నా. పంపిణీ సరిగ్గా జరిగితేనే సినిమాకి న్యాయం జరుగుతుంది. అందుకని పకడ్బందీగా ప్రణాళికలు వేసుకోవాలి. జస్ట్ అలా అమ్మేసి, ఇలా హ్యాపీగా ఇంటికెళ్లిపోయేంత తేలికైన చిత్రం కాదిది. యూఎస్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మంచి వేదిక కావాలి నాకు. ఫాక్స్, వయొకామ్ వంటి సంస్థలు ముందుకొస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఇప్పటికి 30 నిమిషాల చిత్రాన్ని తీశాను. ఇంకా రెండు గంటల సినిమా తీయాల్సి ఉంది. అన్నీ అనుకూలిస్తే.. మొదలుపెడతా’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement