
సంచలన టైటిల్‌తో రానున్న కమల్
చెన్నై: నటుడు కమల్‌హాసన్ నాయకుడున్నాడు అంటున్నారు. ఏమిటీ అప్పడే ఏదేదో ఊహించుకుంటాన్నారా? మీరు అనుకుంటున్నట్లు ఇది రాజకీయపరమైనది కాదు. ఆయన తాజా చిత్రానికి తలైవన్ ఇరుక్కిరాన్ అనే పేరును ఖరారు చేశారు. కమల్‌హాసన్ ప్రస్తుతం ఒక బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోపై దృష్టి పెట్టినా, తాను స్వీయ దర్శకత్వంలో నటించిన విశ్వరూపం-2 చిత్రాన్ని విడుదల చేసే కార్యక్రమాల్లోనూ నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఈ చిత్రం తుది ఘట్ట కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. విశ్వరూపం-2 చిత్రం తరువాత నిర్మాణంలో ఉన్న మరో చిత్రం శభాష్‌నాయుడు షూటింగ్‌ను పూర్తి చేయనున్నట్లు సమాచారం.
ఇలాంటి సమయంలో కమల్ తన తాజా చిత్రాన్ని ప్రకటించడం విశేషం. దీనికి తలైవన్ ఇరుక్కిరాన్ (నాయకుడున్నారు) అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు గురువారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే నిజానికి ఇదే టైటిల్‌ను కమల్‌హాసన్ ఎనిమిదేళ్ల క్రితమే వెల్లడించారు. దీన్ని తమిళం, హిందీ భాషలలో తెరకెక్కించనున్నట్లు, హిందీ వెర్షన్‌లో నటుడు సల్మాన్‌ఖాన్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తరువాత రెండేళ్లకు సల్మాన్‌ఖాన్‌కు బదులు నటుడు సైఫ్‌అలీఖాన్ నటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే అవేమీ తెరరూపం దాల్చలేదు. తాజాగా మరోసారి తలైవన్ ఇరుక్కిరాన్ టైటిల్‌ను కమల్ వెల్లడించడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కమల్ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.