‘కరణ్‌ ఆడించే కీలుబొమ్మ తను’ | Kangana Ranaut Criticises Alia Bhatt Again Over Manikarnika Issue | Sakshi
Sakshi News home page

అలియా భట్‌పై కంగనా రనౌత్‌ విమర్శలు

Published Fri, Feb 8 2019 4:13 PM | Last Updated on Fri, Feb 8 2019 4:18 PM

Kangana Ranaut Criticises Alia Bhatt Again Over Manikarnika Issue - Sakshi

‘మణికర్ణిక’ వివాదం గురించి తనకు తెలియదని, బిజీగా ఉండటం వల్లే కంగనాకు సపోర్టు చేయలేకపోయానన్న అలియా భట్‌ వ్యాఖ్యలపై కంగనా రనౌత్‌ మండిపడింది. శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. ‘ మణికర్ణిక నా వ్యక్తిగత వివాదం అని అలియా భావించడానికి గల కారణమేంటో తెలియదు. ఇది జాతి విముక్తి కోసం పోరాడిన వీరనారి లక్ష్మీబాయి కథ. ఈ సినిమా గురించి దేశం మొత్తం చర్చ జరుగుతోంది. కానీ బాలీవుడ్‌ నుంచి ఏమాత్రం స్పందనలేదు. అయితే నా సహాయం పొందిన అలియా.. నాకు మద్దతుగా నిలిచేందుకు ఎందుకు భయపడుతుందో అర్థంకావడం లేదు. స్త్రీ సాధికారత, జాతీయవాదం గురించిన సినిమాను సపోర్టు చేయడానికి తను వెనకడుగు వేసింది. అయినా తన అస్థిత్వాన్ని స్వతహాగా నిలుపుకోలేని ఆ మహిళ ఇంతకన్నా ఏం చేస్తుంది. తన ఉనికిని కాపాడుకునేందుకు కరణ్‌ జోహార్‌ ఆడించే కీలుబొమ్మగా మారిన అలియా సాధించిన విజయాలను నేను ఎంతమాత్రం లెక్కచేయను’ అంటూ అలియాను తీవ్ర స్థాయిలో విమర్శించారు.(‘మణికర్ణిక’ వివాదంపై స్పందించిన క్రిష్‌)

కాగా నెపోటిజమ్‌(బంధుప్రీతి) గురించి మాట్లాడినందు వల్లే తనకు ఎవరూ మద్దతునివ్వడం లేదని కంగనా బాలీవుడ్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలపై స్పందించిన అలియా... కంగనను కావాలని అప్‌సెట్‌ చేయలేదని,  ఈ విషయమై తనకు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అయినప్పటికీ ‘క్వీన్‌’ మాత్రం అలియాపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇక ఫిల్మ్‌ మేకర్‌ మహేష్‌ భట్‌ కూతురైన అలియా భట్‌.. కరణ్‌ జోహార్‌ సినిమా ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ ద్వారా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.(క్రిష్‌ అందుకే తప్పుకున్నారు : కంగనా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement