అతనికి 37.. ఆమెకు 27.. ఇంకా యువకులేనా?! | Kangana Ranaut Said Ranbir Kapoor is 37 And Alia Bhatt is 27 Then Why Should We Call Them Young | Sakshi
Sakshi News home page

అతనికి 37.. ఆమెకు 27.. ఇంకా యువకులేనా?!

Published Thu, Mar 28 2019 3:27 PM | Last Updated on Thu, Mar 28 2019 3:36 PM

Kangana Ranaut Said Ranbir Kapoor is 37 And Alia Bhatt is 27 Then Why Should We Call Them Young - Sakshi

బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మైండ్‌లో ఏం అనిపిస్తే బ్లైండ్‌గా దాన్నే బయటకు చెప్పేస్తుంటారు కంగనా. ఆఖరికి సూపర్‌ స్టార్లను సైతం ఖతరు చేయ్యరు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో స్టార్‌ కిడ్‌ ఆలియా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు కంగనా. అయితే ఈ సారి ఆలియాతో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్‌ రణబీర్‌ను కూడా టార్గెట్‌ చేశారు. ఆలియా, రణ్‌బీర్‌ కపూర్లను చాలా సంవత్సరాల నుంచి యువ నటులు అనే పిలుస్తాన్నమంటూ ఎద్దేవా చేశారు.

ఈ విషయం గురించి కంగనా మాట్లాడుతూ.. ‘జనాలపై తప్పుగా రుద్దబడే అభిప్రాయాలను మాత్రమే ఎత్తి చూపుతాను. రణ్‌బీర్‌ కపూర్‌కి ఇప్పుడు 37 ఏళ్లు.. ఆలియా భట్‌కు 27 సంవత్సరాలు. ఆమె వయసులో మా అమ్మకు ముగ్గురు పిల్లలున్నారు. అలాంటిది వారిని ఇంకా యువనటులు అని పిలవడం వల్ల ప్రయోజనం ఏంటి. నిజంగా ఇది మంచి పద్దతి కాదన్నా’రు. అంతేకాక ‘కొందరు తమ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడ్డానికి, పర్సనల్‌ ఫోటోలను షేర్‌ చేయడానికి ఇష్టపడతారు. కానీ దేశం గురించి మాట్లాడే సందర్భం వస్తే మాత్రం ఇది ‘మా వ్యక్తిగత విషయం ఇందులో జోక్యం చేసుకోకూడదం’టూ మౌనం వహిస్తారం’టూ రణ్‌బీర్‌ కపూర్‌ గురించి పరోక్ష విమర్శలు చేశారు.

(చదవండి : ఆమెకు  సారీ చెబుతా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement