నటి సంజనాపై నిర్మాతల ఫిర్యాదు | Kannada Film Producers are annoyed with Kannada Actress Sanjana | Sakshi
Sakshi News home page

నటి సంజనాపై నిర్మాతల ఫిర్యాదు

Published Sun, Oct 9 2016 4:57 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

నటి సంజనాపై నిర్మాతల ఫిర్యాదు

నటి సంజనాపై నిర్మాతల ఫిర్యాదు

సాక్షి,బెంగళూరు: కన్నడ చిత్రాలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసారని ఆరోపిస్తూ ప్రముఖ కన్నడ నటి సంజనాపై కన్నడ చిత్ర నిర్మాతలకు కొందరు కర్ణాటక చిత్ర వాణిజ్య మండలిలో ఫిర్యాదు చేశారు. టీవీషోలలో సినీ రంగ ప్రముఖులు పాల్గొంటున్న విషయంపై  నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నటి సంజనా... దర్శకనిర్మాతలు డబ్బా సినిమాలను తీసి వాటిని ప్రజలపై రుద్దుతుండడం వల్లే టీవీల్లో ప్రసారమయ్యే రియాలిటీషోలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని వ్యాఖ్యానించడం సరికాదంటూ    ఫిర్యాదు చేశారు.    
 
 ఈ వివాదంపై స్పందించిన నటి సంజనా ..టీశీ వెంకటేశ్ తనను ఏకవచనంతో సంభోధిస్తూ తనపై చేసిన వ్యాఖ్యల దృష్ట్యా  అలా మాట్లాడానన్నారు.  తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరుతూ తన ఫేస్‌బుక్‌లో వీడియో విడుదల చేసారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement