కపూర్లు ఉత్తమ నటులు : కరీనాకపూర్
కపూర్లు ఉత్తమ నటులు : కరీనాకపూర్
Published Sat, Sep 14 2013 12:15 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
న్యూఢిల్లీ: బాలీవుడ్ పరిశ్రమలో కపూర్లు ఉత్తమ నటులని కరీనా కపూర్ పేర్కొంది. ఓ వార్తా సంస్థతో ఆమె మాట్లాడు తూ... రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటించడాన్ని నేనెంతగానో ఇష్టపడతా. ప్రస్తుతతరం నటుల్లో రణ్‌బీర్ మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. మా నాన్న, అక్కతో కలిసి నటించడమన్నా ఇష్టమే. అయితే మేమేవరం ఏదో ఆసక్తితో పరిశ్రమలోకి రాలేదు. మా రక్తంలోనే నటన ఉందేమో. బాలీవుడ్‌లో కపూర్లు మంచి నటులనేది నా అభిప్రాయమ’ని చెప్పింది. ఇదిలాఉండగా కరీనా, రణ్‌బీర్‌కు కలిసి జోయా అఖ్తర్ సిని మాలో నటిస్తున్నారని మీడియాలో పుకా ర్లు షికారు చేస్తున్నాయి.
దీనిపై కరీనా స్పందిస్తూ... ‘అందులో నిజం లేదు. అయితే భవిష్యత్తులో ఇది సాధ్యం కావొచ్చ’ని చెప్పింది. కరీనా ముత్తాత పృథ్వీరాజ్ కపూర్ సినీ నేపథ్యం ఆయన ముగ్గురు కొడుకులు రాజ్ కపూర్, షమ్మీ కపూర్, శశి కపూర్‌లను బాలీవుడ్‌లో అడుగుపెట్టేలా చేసింది. శశి కపూర్ భార్య జెన్నిఫర్ కపూర్ కుటుంబం నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన తొలి మహిళా నటి. ఇక రాజ్‌కపూర్ ముగ్గురు కొడుకులు రణ్‌ధీర్ కపూర్, రిషీకపూర్, రాజీవ్ కపూర్‌లు కూడా కొన్నిరోజులపాటు బాలీవుడ్‌లో తమ జోరు కొనసాగించారు. ఇక నాలుగో తరంలో రణ్‌ధీర్, బబితాల కుమార్తె కరిష్మా కపూర్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా చెల్లి కరీనాను బాలీవుడ్‌కు పరిచయం చేసింది.
ఇలా తమ వంశానికి చెందినవారు తరతరాలుగా బాలీవుడ్‌లో సత్తా చాట డాన్ని కరీనా గొప్పగా చెప్పుకుంటోంది. తాను కూడా నటన ను ఎంతో ఆస్వాధిస్తున్నానని, అదృష్టం కూడా కలిసొచ్చిం దని, కపూర్ల పుణ్యమా అనే తాను విభిన్న పాత్రలను పోషిస్తూ అభిమానులను ఆనంద పరుస్తున్నానని చెబుతోంది. అయితే భర్త సైఫ్ అలీఖాన్‌కు నిర్మాణ సంస్థ ఉన్నా బాలీవుడ్‌లో మిగతా హీరోయిన్లలా తనకు నిర్మాతగా మారే ఆలోచన లేదని చెప్పింది. తనకు నటించడం మాత్రమే వచ్చని, దానిని మాత్రమే కొనసాగిస్తానంది.
Advertisement
Advertisement