హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన నాటి నుంచి బాలీవుడ్‌లో బంధుప్రీతి, పక్షపాత ధోరణి గురించి తీవ్రమైన చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, ఇండస్ట్రీకి చెందిన పలువురు పెద్దల గురించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా కరణ్ జోహార్, మహేష్ భట్, ఆలియా భట్‌లపై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరణ్ జోహర్.. కంగనను విమర్శిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 2017లో జరిగిన ఓ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అంతర్జాతీయ సమావేశం సందర్భంగా కరణ్ జోహర్.. కంగనను తీవ్రంగా విమర్శించారు. (‘కరణ్ జోహార్‌ను అభిమానిస్తానని చెప్పలేదు’)
This the clip Kangana is talking about, Karan telling her to leave and people applauding. He attacked her on an international summit #KanganaSpeaksToArnab pic.twitter.com/ODl0jTHaxe
— Navi (@NaviKRStan) July 18, 2020
ఈ వీడియోలో కరణ్ ఆడియెన్స్‌ను ఉద్దేశిస్తూ.. ‘కంగన తనను తాను బాధితురాలిగా చెప్పుకోవడానికి.. మహిళననే సానుభూతి పొందడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రతి సారి తనని తాను బాధితురాలిగా చెప్పుకుంటూ.. ఇండస్ట్రీ ఆమెని ఎలా బెదిరించదో వివరించే విషాదకర కథలు చెప్పుకుంటూ ఉంటారు. తుపాకీతో బెదిరించి మరి నటించమని మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయడం లేదు కదా. ఇండస్ట్రీని వదిలి వెళ్లండి.. వేరే పని చేసుకొండి’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు కరణ్. అంతేకాక ప్రతిసారి అవతలి మనిషి ఇగోను రెచ్చగొడితే ఇలాంటి పరిణామాలే ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు కరణ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇదిలా ఉండగా.. సుశాంత్ సింగ్ ఆత్మహత్య విషయంలో తన విమర్శలను నిరూపించుకోలేకపోతే, పద్మశ్రీ అవార్డును ఉంచుకునే అర్హత తనకుండదని కంగనా పేర్కొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment