చాలా కాలం తరువాత మణిరత్నం మార్క్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కి మంచి విజయం సాధించిన సినిమా ఓకే బంగారం. వరుస ఫ్లాప్లతో డీలా పడిపోయిన మణిరత్నం, ఈ సినిమా సక్సెస్తో తిరిగి ఫాంలోకి వచ్చాడు. దీంతో ఈ సినిమాను బాలీవుడ్లోనూ రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. నటీనటుల ఎంపిక విషయంలో చాలా రోజులు ఆలస్యం అయినా, తర్వాత సరైన నిర్మాత దొరకకపోవటంతో మరింత ఆలస్యం అయ్యింది. ఫైనల్‌గా ఓకే బంగారం బాలీవుడ్ రీమేక్ కు టీం సెట్ అయ్యిందన్న వార్త బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ పొయటిక్ లవ్ స్టోరీని హిందీలో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. గతంలో మణిరత్నం తెరకెక్కించిన సఖి సినిమాను సాథియా పేరుతో బాలీవుడ్‌లో తెరకెక్కించిన షాద్ అలీ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఆషికీ 2 సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్ధాకపూర్ ఈ సినిమాలో మరోసారి తెరను పంచుకోనున్నారు. సౌత్‌లో సూపర్బ్ మ్యూజిక్ తో ఆకట్టుకున్న ఏఆర్ రెహమాన్ మరోసారి ఈ ప్రేమకథకు సంగీతం అందించనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఓకే బంగారం రీమేక్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
బంగారం బాలీవుడ్‌కి వెళ్తోంది
Published Fri, Jan 1 2016 4:20 PM | Last Updated on Sun, Sep 3 2017 2:55 PM
Advertisement
Advertisement