
కరణ్ జోహర్, కరీనా కపూర్ (పాత చిత్రం)
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి తన స్నేహితుడు, దర్శకుడు కరణ్ జోహర్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. దాదాపు 17 ఏళ్ల కిందట ‘కభీ ఖుషీ కభీ ఘమ్’లాంటి భారీ హిట్ అందుకున్న మూవీలో అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, షారుఖ్ ఖాన్, కాజోల్, హృతిక్ రోషన్, కరీనా కపూర్‌లు నటించి మెప్పించారు. కథతో పాటు నటీనటుల క్యారెక్టర్లు అభిమానులకు వినోదాన్ని పంచాయి. అయితే కరణ్ జోహర్ దర్శకత్వం వహించిన ఆ మూవీ తర్వాత ఏ ప్రాజెక్టులోనూ కరీనా కపూర్ నటించలేదు.
ధర్మా ప్రొడక్షన్స్‌లో తెరకెక్కబోతున్న ఓ మూవీలో కరీనా నటించనున్నారని, కరణ్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నాడని బాలీవుడ్ సర్కిల్స్‌లో విషయం చక్కర్లు కొడుతోంది. యాక్షన్ హీరో అక్షయ్ కుమార్‌కు జోడీగా కరీనా కనిపించనున్నారు. గతంలో వచ్చిన ‘కల్ హో న హో’మూవీలో తొలుత కరీనాను కరణ్ జోహర్ సంప్రదించగా ఆఫర్‌ను ఆమె రిజెక్ట్ చేసింది. ఆపై ప్రీతి జింటా ఆ ఛాన్స్ దక్కించుకోవడంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు.
అయితే కరణ్ ప్రస్తుతం శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్‌లను వెండితెరకు పరిచయం చేయనున్న మూవీ ధడక్. ఈ నెల 20న ధడక్ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు చుంకీపాండే కూతురు అనన్య పాండేను స్టూడెండ్ ‘ఆఫ్ ది ఇయర్’రెండో భాగంతో బాలీవుడ్‌కు పరిచయం చేసే బాధ్యతల్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కరీనా, అక్షయ్‌లతో కరణ్ జోహర్ లేటెస్ట్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని సమాచారం. అయితే ఇప్పటివరకూ కరణ్, కరీనా, అక్షయ్‌ల నుంచి ఎలాంటి అధికారక ప్రకటన వెలువడలేదు.
Comments
Please login to add a commentAdd a comment