మీకోనమస్కారం! | Stop asking me about 'Shuddhi', says Karan Johar | Sakshi
Sakshi News home page

మీకోనమస్కారం!

Published Wed, Jun 3 2015 10:20 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మీకోనమస్కారం! - Sakshi

మీకోనమస్కారం!

 పునర్జన్మల నేపథ్యంలో రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ సినిమా అంటే బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్‌కు చాలా ఇష్టం. ఆయన కూడా ఎప్పటినుంచో ఇలాంటి తరహా కథాంశంతో సినిమా తీద్దామని అనుకున్నారు. ఇటీవల ఆయన ప్రకటించిన ‘శుద్ధి’ ఈ తరహా కథాంశంతో రూపొందనున్నదే. ఆయన ఏ ముహూర్తాన ఈ చిత్రం గురించి అనుకున్నారో కానీ, అడుగడుగునా ఆటంకాలే. ముందు హృతిక్‌రోషన్, కరీనా కపూర్ ఖాన్లను హీరో, హీరోయిన్లుగా ప్రకటించారు.
 
 కానీ, ఆ తర్వాత సల్మాన్ ఖాన్‌ను హీరోగా తీసుకున్నారు. అదీ కుదరలేదు. ఫైనల్‌గా వరుణ్‌ధావన్, ఆలియా భట్‌ను జంటగా తీసుకున్నారు. కానీ సినిమా షూటింగ్ మాత్రం స్టార్ట్ కాలేదు. దాంతో కరణ్ ఏ సమావేశంలో పాల్గొన్నా, ‘శుద్ధి’ గురించి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు పాత్రికేయులు.  ఈ ప్రశ్నలకు ముగింపు పెట్టాలనుకున్న కరణ్.. ‘‘మీకో నమస్కారం. నన్నీ విషయం గురించి అడగకండి. ఎప్పుడైతే పోస్టర్ రిలీజ్ చేస్తానో అప్పుడే ఈ సినిమా గురించి చెప్పగలను’’ అని కోపం, అసహనం వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement