నవంబర్ 17న కార్తి 'ఖాకీ' | Karthi Khaki release date | Sakshi
Sakshi News home page

నవంబర్ 17న కార్తి 'ఖాకీ'

Published Sat, Oct 21 2017 12:05 PM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

Karthi Khaki - Sakshi

తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ సొంతం చేసుకున్న దక్షిణాది హీరో కార్తి. సూర్య తమ్ముడిగా తెరంగేట్రం చేసిన కార్తి తరువాత తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ తో పాటు యాక్షన్ హీరోగానూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కార్తి హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఖాకీ త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఇప్పటికే పోలీస్ పాత్రల్లో ఆకట్టుకున్న కార్తి మరోసారి పోలీస్ గెటప్ లో అలరించనున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు వినోద్ దర్శకుడు. జిబ్రాన్ సంగీతమందించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను నవంబర్ 17న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement