జనం క్షమించేలా... పోలీస్‌ కాలర్‌ ఎగరేసేలా! | tamil hero karthi new movie khaki special | Sakshi
Sakshi News home page

జనం క్షమించేలా... పోలీస్‌ కాలర్‌ ఎగరేసేలా!

Published Wed, Nov 8 2017 12:21 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

 tamil hero karthi new movie khaki special - Sakshi

అతనో పోలీసాఫీసర్‌! చాలా మంచోడు... ముఖ్యంగా లంచాలు తీసుకోడు. ఒక్కోసారి కేసుల విషయంలో ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు తలొగ్గినా... ఓ కేసు విషయంలో మాత్రం గట్టిగా నిలబడతాడు. ‘ఇప్పుడీ కేసు విషయంలో ఏం చేయకపోతే... జనం మనల్ని క్షమించరు సార్‌’ అని పట్టుబడతాడు. అతనెందుకు అంత పట్టుబట్టాడు? ఆ కేసు ఏంటి? జనం క్షమించేలా... పోలీస్‌ కాలర్‌ ఎగరేసేలా... కేసును ఎలా సాల్వ్‌ చేశాడు? అనే కథతో రూపొందిన సినిమా ‘ఖాకి’. హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో కార్తీ, రకుల్‌ జంటగా నటించిన ఈ సినిమాను ఆదిత్య మ్యూజిక్‌ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది.

ఉమేశ్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా నిర్మాతలు. ఇటీవలే జిబ్రాన్‌ స్వరపరిచిన పాటల్ని విడుదల చేశారు. సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనలతో ‘హిస్టరీ బిహైండ్‌ ద క్రైమ్‌ నెట్‌వర్క్‌’ కాన్సెప్ట్‌తో దర్శకుడు సినిమాను ఆసక్తిగా తీశారు. జిబ్రాన్‌ పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పోలీస్‌గా కార్తీ నటన ప్రతి ఒక్కర్నీ అలరిస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కేవీ శ్రీధర్‌రెడ్డి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement