Khaki
-
కార్తి హిట్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్
తమిళంలో కెరీర్ ప్రారంభించిన కార్తి.. కొన్నాళ్లకే టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నుంచి వచ్చిన సినిమాల్లో యుగానికొక్కడు, నాపేరు శివ,ఊపిరి,సుల్తాన్,సర్దార్, ఖాకీ, ఖైదీ వంటి సూపర్ హిట్ చిత్రాలతో తెలుగువారికి ఆయన ఎంతో దగ్గరయ్యాడు. తాజాగా కార్తి కెరియర్లో 25వ సినిమా అయిన జపాన్ అంతగా ప్రేక్షకులను మెప్పించలేదు. దీంతో తర్వాతి ప్రాజెక్ట్‌ను ఆయన చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నాడు. 2017లో కార్తి కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచిన ఖాకి చిత్రానికి సీక్వెల్‌ను దర్శకుడు ప్రకటించారు. 1995-2006 మధ్యకాలంలో జరిగిన 'ఆపరేషన్ బవారియా' మిషన్ ఆధారంగా ఖాకి సినిమాను తెరకెక్కించారు. తమిళనాడు పోలీసుల నిజ జీవిత ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైనప్పుడు ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఖాకీ సినిమా స్క్రీన్ ప్లే ఎడ్జ్ ఆఫ్ యువర్-సీట్ అనేలా ఉంటుంది. సినీ విమర్శకుల నుంచి కూడా ఖాకీ మూవీపై ప్రశంసలు వచ్చాయి. ఖాకి సినిమాకు దర్శకుడు హెచ్ వినోద్ ఈ చిత్రానికి సీక్వెల్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. డైరెక్టర్ వినోద్ ప్రస్తుతం కమల్ హాసన్ KH233 పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత కార్తితో ఖాకి సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తాడని తెలుస్తోంది. ఇదే విషయాన్ని అక్కడి సినీ జర్నలిస్ట్‌లతో వినోద్ తెలిపారట. ఈ సినిమా సీక్వెల్ కోసం ఇప్పటికే కథ కూడా రెడీగా ఉన్నట్లు సమాచారం. దానిని కార్తికి కూడా చెప్పాడని తెలుస్తోంది. కమల్ హాసన్‌తో తన ప్రస్తుత చిత్రం KH233 పూర్తి చేసిన తర్వాత మాత్రమే తాను ఖాకి- 2 కథను పూర్తి చేస్తానని హెచ్ వినోద్ తెలియజేశాడట. ఈ ఏడాదిలో అజిత్‌తో తెగింపు సినిమాను వినోద్ తెరకెక్కించి హిట్ కొట్టాడు. As per Vikatan,#TheeranAdhigaramOndru Sequel Oncards 🔥 - HVinoth has written the one liner and narrated to #Karthi🤝 - After completing #KH233, HVinoth will complete the entire story of TheeranAdhigaram-2 & going to be filmed soon🎬⌛ - Part 1 has been one of the best cop… pic.twitter.com/SEKagwzSkm — AmuthaBharathi (@CinemaWithAB) November 17, 2023 -
ఖాకి స్పషల్ ఎడిషన్
-
అంత ఆశ అవసరమా అనిపిస్తోంది
‘‘ఐదుగురు అక్కల తర్వాత పుట్టిన తమ్ముడి కథ ‘చిన బాబు’. తండ్రి వ్యవసాయం చేస్తుంటాడు. కొడుకు కూడా వ్యవసాయమే చేస్తాడు. ఎవరి వృత్తిని వాళ్లు బండిపై రాసుకున్నట్టు ఈ చిత్రంలో నేను ఫార్మర్ అని రాసుకుంటాను. రైతు అనే ఉద్యోగాన్ని గర్వంగానే భావించాను’’ అని హీరో కార్తీ అన్నారు. కార్తీ, సాయేషా సైగల్ జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చినబాబు’. హీరో, కార్తీ అన్న సూర్య, మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కార్తీ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు..పాండిరాజ్‌గారు చేసిన ‘పసంగ’ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. అది చిన్న పిల్లలు, తల్లిదండ్రులకు సంబంధించిన సినిమా. పేరెంటింగ్ గురించి చెప్పిన సినిమా. ఆయనతో పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకుంటుంటే ‘చినబాబు’తో కుదిరింది. ఈ చిత్రంలో నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తుంటా. అక్కలకు, వాళ్ల కూతుళ్లకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ ఉండే పాత్ర నాది. మన సంస్కృతిలో పిల్లలు సంపద. అలాంటి సంపదను, కుటుంబ బంధాలను ఇందులో చూపించాం. ఈ సినిమాలోనే నేను తొలిసారి పెద్ద కుటుంబంతో పని చేశా. చాలా మంచి ఫీలింగ్ వచ్చింది. ఈ చిత్రంలో రైతుల కష్టనష్టాలను చూపించడం లేదు. పాజిటివ్ సైడ్‌లో చూపిస్తున్నాం. జర్మనీలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు. కేరళలో ఏడాదికి రెండు, మూడు కోట్లు సంపాదిస్తున్నారు. అలాంటి విషయాలను మళ్లీ చెప్పాలనే అంశంతో ఈ సినిమా చేశాం.పాండిరాజ్‌గారు కూడా రైతే. ఆయన చేసి చూపించినవన్నీ నేను చేశా. రోజూ ఉదయం ఆరు గంటలకే పొలాలకు వెళ్లి పనులు చేసేవాణ్ని. వ్యవసాయం ఎక్కడైనా ఒకటే. తెలుగు అయినా తమిళ నాట అయినా.‘రంగస్థలం’ సినిమా తర్వాత నేను గోదావరి యాస ట్రై చేశాను. ఈ సినిమా చూసేవారికి అక్కలు, మావయ్యలు, బావలు కనిపిస్తారు. అందరూ కనెక్ట్ అవుతారు. మన కల్చర్‌ని ఈ తరం పిల్లలకు చూపించే సినిమా అవుతుంది. నాకు వ్యవసాయం టచ్ ఉంది. నా భార్య ఓ రైతు కూతురే. సెలవుల్లో ఆ పల్లెటూరికి వెళ్తాం. నా కూతురు కూడా సెలవుల్లో పల్లెటూళ్లోనే ఉంటుంది. మా పెదనాన్న రైతు. మా నాన్న ఎప్పుడూ ‘ఈ సిటీ బోర్ కొడుతోందిరా. నేను ఊరెళ్తున్నాను’ అంటారు. ఆ టచ్ మనకూ ఉండాలి. ఉంటుంది కూడా.మా అన్న సూర్యగారు మంచి నిర్మాత. షూటింగ్ స్పాట్‌కి ఒక్క రోజు కూడా రాలేదు. సినిమా ఎలా ఉంది? అని అడిగితే, ‘అది ఆడియన్స్ చెప్తారు’ అన్నారు. నేను పదేళ్లుగా నటిస్తున్నా. నా నటన నచ్చకపోతే నిర్మాతగా మారతాను. స్టార్టింగ్‌లో దర్శకుడిగా చేయాలనుకున్నా. ఇప్పుడు దర్శకులను, వాళ్లు పడే కష్టాన్ని చూస్తే నాకు నేను ‘అంత ఆశ ఎందుకురా నీకు’ అనుకుంటాను. వయసులో ఉన్నప్పుడే నటించాలి. వయసు మీద పడే కొద్దీ మనం సంపాదించుకున్న జ్ఞానంతో దర్శకత్వం చేయొచ్చు.∙ప్రస్తుతం‘ఆవారా’ లాంటి సినిమా చేస్తున్నా. రకుల్ హీరోయిన్. వినోద్‌గారు ‘ఖాకీ’ కథ చెప్పినప్పుడు సీక్వెల్ చేద్దామన్నారు. ఆయన కథతో వస్తే చేస్తా. మంచి కథ కుదిరితే తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తా. మల్టీస్టారర్ మూవీస్ పెద్దగా ఇష్టం ఉండదు. ‘ఊపిరి’ మంచి కథ. అందుకే చేశా. -
జనం క్షమించేలా... పోలీస్ కాలర్ ఎగరేసేలా!
అతనో పోలీసాఫీసర్! చాలా మంచోడు... ముఖ్యంగా లంచాలు తీసుకోడు. ఒక్కోసారి కేసుల విషయంలో ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు తలొగ్గినా... ఓ కేసు విషయంలో మాత్రం గట్టిగా నిలబడతాడు. ‘ఇప్పుడీ కేసు విషయంలో ఏం చేయకపోతే... జనం మనల్ని క్షమించరు సార్’ అని పట్టుబడతాడు. అతనెందుకు అంత పట్టుబట్టాడు? ఆ కేసు ఏంటి? జనం క్షమించేలా... పోలీస్ కాలర్ ఎగరేసేలా... కేసును ఎలా సాల్వ్ చేశాడు? అనే కథతో రూపొందిన సినిమా ‘ఖాకి’. హెచ్. వినోద్ దర్శకత్వంలో కార్తీ, రకుల్ జంటగా నటించిన ఈ సినిమాను ఆదిత్య మ్యూజిక్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాతలు. ఇటీవలే జిబ్రాన్ స్వరపరిచిన పాటల్ని విడుదల చేశారు. సినిమా ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనలతో ‘హిస్టరీ బిహైండ్ ద క్రైమ్ నెట్వర్క్’ కాన్సెప్ట్‌తో దర్శకుడు సినిమాను ఆసక్తిగా తీశారు. జిబ్రాన్ పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పోలీస్‌గా కార్తీ నటన ప్రతి ఒక్కర్నీ అలరిస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కేవీ శ్రీధర్‌రెడ్డి. -
కార్తీ ఏడాదికో తెలుగు సినిమా చేయాలి
‘రజనీకాంత్, కమల్‌హాసన్, కార్తీక్ వంటి హీరోలు తెలుగులో చాలా మంచి సినిమాలు చేశారు. కార్తీ కూడా సంవత్సరానికి ఒక తెలుగు స్ట్రైట్ సినిమా చెయ్యాలి. అతనితో సినిమా చేసేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. కార్తీ, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా వినోద్ దర్శకత్వంలో ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. ప్రకాశ్ తమిళంలో నిర్మించిన చిత్రం ‘ధీరన్ అధికారమ్ ఒండ్రు’. ఈ సినిమాని ‘ఖాకి’ పేరుతో ఆదిత్య మ్యూజిక్ అధినేతలు ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. జిబ్రాన్ స్వరపరచిన ఈ సినిమా పాటలను ‘దిల్’ రాజు రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘పోలీస్ పాత్రలు హీరోలకి ఛాలెంజింగ్‌గా ఉంటాయి. ‘నా పేరు శివ’, ఊపిరి’ సినిమాలతో కార్తీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఆదిత్య మ్యూజిక్ అధినేతలు ‘ఖాకి’తో నిర్మాతలుగా మారుతుండటం సంతోషం’’ అన్నారు. కార్తీ మాట్లాడుతూ– ‘‘పోలీస్ పాత్రల్లో రెండు సినిమాలు చేశా. దర్శకుడు వినోద్ చెప్పిన కథ వినగానే చాలా ఇన్స్పైర్ అయ్యాను. చాలా మంది పోలీసాఫీసర్స్‌ని కలిశాను. 1995 నుంచి 2005 వరకూ జరిగిన ట్రూ స్టోరీ ఇది. ఇప్పటివరకు వచ్చిన పోలీస్ స్టోరీస్ కంటే డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ నెల 17న సినిమా విడుదలవుతుంది’’ అన్నారు. ‘‘ఎంటర్టైన్మెంట్తో పాటు హిందూయిజం, ఎడ్యుకేషన్, పోలీస్ డిపార్ట్మెంట్స్, ్రౖకైమ్.. ఈ చిత్రంలో చూపించాం. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇస్తుంది’’ అన్నారు వినోద్. ‘‘ఖాకి’ నాకు స్పెషల్ మూవీ. నా పాత్ర కొత్తగా ఉంటుంది’’ అన్నారు రకుల్. నిర్మాతలు కె.ఎస్.రామారావు, శివలెంక కృష్ణప్రసాద్, కె.అచ్చిరెడ్డి, పి.కిరణ్, లగడపాటి శ్రీధర్, శైలేంద్రబాబు, దర్శకులు ఎస్.వి.కృష్ణారెడ్డి, ఎన్.శంకర్, కెమెరామెన్ సత్యం తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీధర్ రెడ్డి. -
నవంబర్ 17న కార్తి 'ఖాకీ'
తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ సొంతం చేసుకున్న దక్షిణాది హీరో కార్తి. సూర్య తమ్ముడిగా తెరంగేట్రం చేసిన కార్తి తరువాత తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ తో పాటు యాక్షన్ హీరోగానూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కార్తి హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఖాకీ త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే పోలీస్ పాత్రల్లో ఆకట్టుకున్న కార్తి మరోసారి పోలీస్ గెటప్ లో అలరించనున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు వినోద్ దర్శకుడు. జిబ్రాన్ సంగీతమందించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను నవంబర్ 17న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
మళ్లీ జోడీగా!
హిట్ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లకు ‘హిట్ పెయిర్’ అనే పేరొస్తుంది. ఆ జంటతో సినిమాలు తీయడానికి దర్శక–నిర్మాతలు ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తారు. అయితే కొంచెం డిఫరెంట్‌గా కార్తీ–రకుల్ మాత్రం తమ కాంబినేషన్లో తెరకెక్కిన ఫస్ట్ మూవీ విడుదల కాకముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది కోలీవుడ్ టాక్. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధీరమ్ అధిగారమ్ ఒండ్రు’లో ఈ ఇద్దరూ నటించారు. ఆ సినిమా తెలుగులో ‘ఖాకీ’గా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోపు కార్తీ–రకుల్ మరో సినిమా ఒప్పుకున్నారట. ఈ ఇద్దరి కాంబినేషన్లో కొత్త దర్శకుని సారథ్యంలో ఓ రొమాంటిక్ మూవీ తెరకెక్కనుందని కోలీవుడ్ టాక్! -
చెడుగుడు పక్కా
అసలే రాజస్థాన్... ఆపై ఎడారి! ఓ పక్క ఎండలు ఇరగదీస్తున్నాయి... మరో పక్క రౌడీల రూపంలో ఉన్న రాబందులు ప్రజల్ని పీడిస్తున్నాయి! అప్పుడక్కడ ఖాకీ చొక్కా వేసుకున్న కార్తీ అడుగు పెడతాడు. ఖాకీలను ఖాతరు చేయని రాబందుల్ని చెడుగుడు ఆడేస్తాడు. పోలీస్ పవర్ చూపించిన ఆ ఖాకీ కథేంటి? అనేది ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో చూపిస్తామంటున్నారు కార్తీ. ఆయన హీరోగా నటిస్తున్న తాజా తమిళ సినిమా ‘ధీరన్ అధిగారమ్ ఒండ్రు’. రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్. హెచ్. వినోద్ దర్శకుడు. ఆదిత్య మ్యూజిక్ ప్రై.లి. సంస్థ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతోంది. ‘ధీరన్ అధిగారమ్ ఒండ్రు’ను తెలుగులో ‘ఖాకి’ పేరుతో విడుదల చేస్తోంది. ఇందులో కార్తీ ఫస్ట్ లుక్‌ను రీసెంట్గా రిలీజ్ చేశారు. ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేశ్ గుప్తా మాట్లాడుతూ – ‘‘2005లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న చిత్రమిది. ఓ పాట, వారం రోజుల టాకీ పార్టు మినహా చిత్రీకరణ అంతా పూర్తయింది. ఆగస్టు నెలాఖరున లేదా సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సత్యన్ సూరన్, సంగీతం: జిబ్రాన్, నిర్మాతలు: ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా. -
'ఖాకీ' డ్రస్‌లో కార్తీ
కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ మరో ఇంట్రస్టింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తన ప్రతీ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేసే ఆ కోలీవుడ్ స్టార్, ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాను కూడా ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే షూటింగ్ జరుగుతుండగానే టాలీవుడ్లో కూడా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టేశాడు. తమిళ్లో ధీరన్ అధిగరమ్ ఓండ్రు పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తెలుగులో ఖాకీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తీ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాతో ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. శతురంగ వేట్టై ఫేం వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. -
హరితవన అభివృద్ధిలో ఖాకీలు!
ముంబై ప్రజలు ట్రీ ప్లాంటేషన్ డే ను ఘనంగా జరుపుకున్నారు. మహరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మొక్క్లలు నాటే కార్యక్రమంలో ముంబై పోలీసులు సైతం భాగస్వాములయ్యారు. నగరంలో హరిత వనాన్ని అభివృద్ధి చేసి, కాలుష్యాన్ని కాలరాసే ప్రయత్నం చేశారు. మహరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో ముంబై పోలీసులు పాలుపంచుకున్నారు. జూలై 1న రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2 కోట్ల మొక్కలను నాటాలన్న తలంపుతో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో తమవంతు ప్రయత్నంగా నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో మొక్కలు నాటారు. మొక్కలు నాటే కార్యక్రమంలో పోలీసులతోపాటు, స్థానిక రాజకీయ నాయకులు, ఎన్జీవో సంస్థలు, ప్రజలు సైతం భాగం పంచుకున్నట్లు ప్రభుత్వాధికారులు తెలిపారు. హరిత వనాన్ని అభివృద్ధి చేసేందుకు పోలీసులు ట్విట్టర్ ను కూడ వాడుకున్నారు. ఆయా ప్రాంతాల పోలీస్టేషన్లలో మొక్కలు నాటుతూ తీసుకున్నఫోటోలను ప్రచారంలో భాగంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. -
మహమ్మారి మట్కా
- మహారాష్ట్ర కేంద్రంగా జిల్లాలో జోరుగా హైటెక్ జూదం - కోట్లు దాటుతున్న దందా, రాజకీయ నాయకుల అండ - మట్కా నగదులో ఖాకీల కక్కుర్తి ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో మట్కా మహమ్మారి కోరలు చాస్తోంది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా సగటు జీవి జీవితాన్ని నాశనం చేస్తోంది. వ్యాపారులు, కూలీలు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, యువత మట్కాకు అలవాటు పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మట్కాకు బానిసై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనలూ జిల్లాలో చోటు చేసుకున్నాయి. రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్మును జూదంలో పెట్టడంతో కుటుంబ పోషణ భారమై జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. పోలీసులు అడపాదడపా దాడులు జరిపినా మట్కాను నియంత్రించలేకపోతున్నారు. ఒకరిద్దరిని అదుపులోకి తీసుకుని.. నిర్వాహకులపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిర్వహకుల నుంచి మమూళ్లు అందడంతో పూర్తిస్థాయిలో పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కోట్లలో వ్యాపారం.. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, బాసర, బోథ్, చెన్నూర్, మంచిర్యాల, కాగజ్‌నగర్ పట్టణాల్లో మట్కా జోరుగా సాగుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో యువత కూడా మట్కాజూదం వైపు ఆకర్షితులవుతున్నారు. జిల్లాలో ప్రతి ఏడాది కోట్ల రూపాయలు మట్కాతో చేతులు మారుతున్నాయి. ముంబయి కేంద్రంగా మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో కళ్యాణి, మిలాన్, ముంబాయి, రాజధాని వంటి కంపెనీలు మట్కా నిర్వహిస్తున్నాయి. ఈ కంపెనీల్లో జిలా ్లకు చెందిన వారూ పాల్గొంటున్నారు. రూ.పదికి రూ.వెయ్యి వస్తుండడంతో యువత అత్యాశకు పోయి మట్కాకు అలవాటు పడుతున్నారు. ఓపెనింగ్, క్లోజింగ్ నంబర్లపై బ్రాకెట్ నెంబర్‌కు వందరేట్ల చెల్లింపుతో మట్కా జూదం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఓపెన్, సాయంత్రం 6 గంటలకు క్లోజింగ్ ఉంటుంది. మనం ఎంపిక చేసిన నెంబర్‌కు లాటరీ తగిలితే మళ్లీ ఆడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో లాటరీ తగిలేవారు తక్కువ శాతం.. డబ్బులు పోగొట్టుకునే వారే అధికంగా ఉంటారు. కార్మికుల నుంచి కాంట్రాక్టర్లు.. వ్యాపారుల నుంచి రాజకీయ నాయకుల వరకు మట్కా జూదంలో పాత్రధారులే. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా మట్కాలో డబ్బులు పెడుతున్నారంటే అతిశయోక్తి కాదు. కొన్ని రోజులుగా జిల్లాలో మట్కాజూదరుల అరెస్టులను చూస్తే ఏ మేర మట్కా జరుగుతుందో తెలిసిపోతోంది. సెల్‌ఫోన్ ద్వారా ఫలితం.. సెల్‌ఫోన్ మెసేజ్‌ల ద్వారానే ఫలితాలు వెల్లడిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి సెల్‌ఫోన్ మెసేజ్ ద్వారా ఈ మట్కా జోరుగా సాగుతోంది. ఒకప్పుడు చిట్టీలపై నంబర్లతో సాగిన ఈ దందా సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో విచ్చలవిడిగా సాగుతోంది. చిట్టీలతో కాకుండా సెల్‌ఫోన్ మెసేజ్‌లతో మట్కా ఆడుతూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో లక్షల్లో జరిగే మట్కా వ్యాపారం ప్రస్తుతం జిల్లాలో కోట్ల రూపాయల్లో కొనసాగుతోంది. పోలీసుల నిఘా పెరగడంతో జిల్లా కేంద్రంగా రోజు రూ.20 నుంచి 30 లక్షల వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని యావత్మాల్, పాండ్రకవడ, చంద్రపూర్, మాం డ్వ, తదితర ప్రాంతాల నుంచి మట్కా సాగుతోంది. మన రాష్ట్రంలోని కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల నుంచి కూడా జిల్లాలో మట్కా సాగుతోంది. సరిహద్దుల్లో జోరుగా సాగుతున్న ఈ మట్కా వ్యాపారాన్ని జిల్లా పోలీసులతోపాటు అంతర్రాష్ట్ర పోలీసుల నిఘాతోనైనా అరికట్టాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఖాకీల కక్కుర్తి.. జిల్లాలో కొంతమంది పోలీసు సిబ్బంది సహకారంతోనే ఈ మట్కా విస్తరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అప్పుడప్పుడు దాడులు చేసి మట్కా నిరోధానికి చర్యలు తీసుకుంటున్న ట్లు నిరూపించినా.. అసలు మూలాల్లోకి వెళ్లడం లేదని తెలుస్తోంది. ఇటీవల కాలంలో మట్కా నిర్వాహకులను అరెస్టు చేస్తున్న పోలీసులు స్వాధీనం చేసుకున్న సొమ్ములో కక్కుర్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. అధిక మొత్తంలో మట్కా నగదు దొరికినా తక్కువ సంఖ్యలో చూపించి మిగతాది నొక్కేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్కా కేసును పట్టుకున్న పోలీసు అధికారి వచ్చిన సొమ్ములో తనతోపాటు కేసును పట్టుకొచ్చిన సిబ్బందికి కూడా వంతుల వారీగా డబ్బులు చెల్లిస్తున్నారనే విమర్శలున్నాయి. రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలో రూ.2.64 లక్షల మట్కా నగదు దొరికినప్పటికీ నాలుగు రోజులు బయటపెట్టకుండా గోప్యంగా ఉంచడం గమనార్హం. నిఘా ఏర్పాటు చేశాం.. మట్కా జూదం నిర్మూలనపై నిఘా ఏర్పాటు చేశాం. జిల్లా కేంద్రంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ప్రత్యేక దృష్టి సారించాం. మహారాష్ట్ర నుంచి నడిచే మట్కా దందాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. మట్కా నిర్వహిస్తున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గణేష్ ఉత్సవాల్లో కూడా మట్కా, పేకాట ఆడినట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. - లక్ష్మీనారాయణ, ఆదిలాబాద్ డీఎస్పీ