చెడుగుడు పక్కా | Khaki releases the film in the month of August or September | Sakshi
Sakshi News home page

చెడుగుడు పక్కా

Published Sat, Jul 1 2017 11:33 PM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

చెడుగుడు పక్కా - Sakshi

చెడుగుడు పక్కా

అసలే రాజస్థాన్‌... ఆపై ఎడారి! ఓ పక్క ఎండలు ఇరగదీస్తున్నాయి... మరో పక్క రౌడీల రూపంలో ఉన్న రాబందులు ప్రజల్ని పీడిస్తున్నాయి! అప్పుడక్కడ ఖాకీ చొక్కా వేసుకున్న కార్తీ అడుగు పెడతాడు. ఖాకీలను ఖాతరు చేయని రాబందుల్ని చెడుగుడు ఆడేస్తాడు. పోలీస్‌ పవర్‌ చూపించిన ఆ ఖాకీ కథేంటి? అనేది ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో చూపిస్తామంటున్నారు కార్తీ.

ఆయన హీరోగా నటిస్తున్న తాజా తమిళ సినిమా ‘ధీరన్‌ అధిగారమ్‌ ఒండ్రు’. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌. హెచ్‌. వినోద్‌ దర్శకుడు. ఆదిత్య మ్యూజిక్‌ ప్రై.లి. సంస్థ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతోంది. ‘ధీరన్‌ అధిగారమ్‌ ఒండ్రు’ను తెలుగులో ‘ఖాకి’ పేరుతో విడుదల చేస్తోంది. ఇందులో కార్తీ ఫస్ట్‌ లుక్‌ను రీసెంట్‌గా రిలీజ్‌ చేశారు.

ఆదిత్య మ్యూజిక్‌ అధినేత ఉమేశ్‌ గుప్తా మాట్లాడుతూ – ‘‘2005లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న చిత్రమిది. ఓ పాట, వారం రోజుల టాకీ పార్టు మినహా చిత్రీకరణ అంతా పూర్తయింది. ఆగస్టు నెలాఖరున లేదా సెప్టెంబర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సత్యన్‌ సూరన్, సంగీతం: జిబ్రాన్, నిర్మాతలు: ఉమేశ్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement