ఇన్నాళ్లకు ఫేస్బుక్లోకి బాలీవుడ్ ముద్దుగుమ్మ | Katrina Kaif Joins Facebook on Her Birthday, Shares Video with Fans | Sakshi
Sakshi News home page

ఇన్నాళ్లకు ఫేస్బుక్లోకి బాలీవుడ్ ముద్దుగుమ్మ

Published Sat, Jul 16 2016 2:54 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఇన్నాళ్లకు ఫేస్బుక్లోకి బాలీవుడ్ ముద్దుగుమ్మ - Sakshi

ఇన్నాళ్లకు ఫేస్బుక్లోకి బాలీవుడ్ ముద్దుగుమ్మ

ముంబయి: ఎట్టకేలకు బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ ప్రముఖ సామాజిక అనుసంధాన వేదిక ఫేస్ బుక్లోకి అడుగుపెట్టింది. తన 33వ పుట్టిన రోజు సందర్భంగా ఫేస్ బుక్ పేజీ ప్రారంభించింది. ఈ సందర్భంగా ఓ వీడియోతో ఆమె తన అభిమానులను అలరించింది. అయితే, ఆ వీడియోలో కనిపించింది కూడా ఆమెనే.

బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ తో కొంత కాలం చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ అమ్మడు ఇప్పుడు సముద్రం బీచ్ ఒడ్డున ఉన్న తన అపార్ట్ మెంట్కు వెళ్లింది. ప్రస్తుతం అక్కడే తన మిత్రులు కరణ్ జోహార్, అలియా భట్, సిద్దార్థ మల్హోత్రా, అభయ్ డియోల్ ఇతరులు రాగా ఆమె అక్కడే కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుక జరుపుకొంది. ఈ వీడియోలో కత్రినా తన ఇంట్లో నుంచి అడుగులు వేసుకుంటూ బయటకు వెళ్లి అలా సముద్రంవైపు చూస్తూ ఆ వెంటనే కెమెరా వైపు తిరిగి హాయ్ అంటూ పలకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement