ఈ పిచ్చి ప్రపంచంలోకి నీకు కూడా స్వాగతం! | Katrina Kaif Facebook chat with Salman Khan, Priyanka Chopra is all kinds of fun | Sakshi
Sakshi News home page

ఈ పిచ్చి ప్రపంచంలోకి నీకు కూడా స్వాగతం!

Published Tue, Jul 19 2016 5:19 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఈ పిచ్చి ప్రపంచంలోకి నీకు కూడా స్వాగతం! - Sakshi

ఈ పిచ్చి ప్రపంచంలోకి నీకు కూడా స్వాగతం!

పోయిన ఆదివారం (జూలై 17న) పుట్టినరోజు జరుపుకున్న కత్రినా కైఫ్ పనిలోపనిగా ఫేస్‌బుక్‌లోనూ అడుగుపెట్టింది. ఫేస్‌బుక్‌లో ఈ అందాల ముద్దుగుమ్మకు మంచి రెస్పాన్సే వస్తున్నది. అభిమానులే కాదు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి సహ నటులు కూడా ఆమెను ఫేస్‌బుక్‌లోకి సాదరంగా స్వాగతించారు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈలోగా ప్రియాంక చోప్రా పుట్టినరోజు రావడంతో తన ఫేస్‌బుక్‌ పేజీలో కత్రినా ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పింది. రానున్న సంవత్సరం నీకు అద్భుతంగా ఉండాలంటూ ఆకాంక్షించింది.

అందుకు థాంక్స్ చెప్పిన దేశీ గర్ల్ ప్రియాంక.. సోషల్ మీడియా పిచ్చి ప్రపంచంలోకి నీకు స్వాగతమంటూ కత్రినాను ఆహ్వానించింది. 'థాంక్యూ బేబీ. ఆలస్యంగా నీకు జన్మదిన శుభాకాంక్షలు. ఎట్టకేలకు నిన్ను కూడా ఈ సోషల్ మ్యాడ్ వరల్డ్ లోకి ఆహ్వానిస్తున్నాను' అని ప్రియాంక బదులిచ్చింది. మొత్తానికి కత్రినా ఫేస్‌బుక్ ఎంట్రీ హ్యాపీహ్యాపీగా ముందుకుసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement