
కీర్తీ సురేశ్
...అని పొగుడుతున్నారట కీర్తీ సురేశ్‌ను ‘సండై కోళి 2’ (పందెం కోడి 2) టీమ్. ఇంతకీ ఆ పొగడ్తకు అర్థం ఏంటో అనుకుంటున్నారా? మరేం లేదు.. బంగారంలాంటి అమ్మాయి అని అర్థం. బంగారు వర్ణమంత అందంగా ఉంటారని ఇలా పొగడ్తల వర్షం కురిపించారని అనుకుంటే పొరబాటే. ఈ పొగడ్తలకు కారణం కీర్తి మేని ఛాయ కాదు మనసు. కీర్తీ సురేశ్‌కు ఏదైనా సినిమా చేసిన తర్వాత ఆ సినిమాకు పని చేసిన చిత్రబృందానికి ఏదో ఓ గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేయడం అలవాటులా ఉంది. ‘మహానటి’ సినిమాకు పని చేసిన అందరికీ బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చారు.
ఇప్పుడు ‘సండై కోళి 2’ టీమ్‌కి అలానే చేశారు. లింగుస్వామి దర్శకత్వంలో విశాల్, కీర్తీ సురేశ్ జంటగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సండై కోళి 2’. 2005లో సూపర్ హిట్ అయిన ‘సండై కోళి’ చిత్రానికి సీక్వెల్. వరలక్ష్మీ శరత్ కుమార్ ముఖ్య పాత్ర చేశారు. ఈ చిత్రంలో తన భాగం షూటింగ్ పూర్తి అవ్వగానే తనతో పాటు పని చేసిన టీమ్ అందరికీ గోల్డ్ కాయిన్స్ బహుమతిగా ఇచ్చారట కీర్తీ. దీంతో టీమ్ అంతా ఫుల్ ఖుష్ అయిందట. నెలల తరబడి తనతో పాటు పని చేసిన టీమ్‌కి ఇచ్చిన రెస్పెక్ట్ చూస్తుంటే కీర్తీ సురేశ్ నిజంగానే బంగారం అనకుండా ఉండక మానలేరు కదా?
Comments
Please login to add a commentAdd a comment