
అజిత్‌తో చేయాలని ఉంది
అది హీరోయిన్లను బాగా బాధింపునకు గురి చేస్తోంది అంటోంది నటి కీర్తీసురేష్. ఇంతకీ ముద్దుగుమ్మ చెప్పే ఆ బాధేమిటో తెలుసుకుంటేపోలా. కోలీవుడ్‌లో రెండో చిత్రంతోనే స్మాష్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న మాలీవుడ్ బ్యూటీ కీర్తీసురేష్. రజనీమురుగన్ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ బబ్లీ గర్ల్ ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో నటిస్తూ యమ బిజీగా ఉంది. రెండో సారి శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేస్తున్న కీర్తీసురేష్‌తో చిన్న భేటీ.
ప్ర: రజనీమురుగన్ చిత్ర విజయాన్ని బాగా ఎంజాయ్ చేస్తునట్లున్నారే?
జ: నిజంగా చాలా సంతోషంగా ఉంది. రజనీమురుగన్ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే ఆ చిత్రం సూపర్‌హింట్ అవుతుందని చాలా మంది అన్నారు. ఇంకా చెప్పాలంటే నటించే ప్రతి చిత్రం విజయం సాధించాలనే పనిచేస్తుంటాం. రజనీమురుగన్ చిత్రం విజయం సంతోషంతో పాటు బాధ్యతను పెంచింది. ఆ విజయాన్ని నిలుపుకోవడానికి మరింత ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ విషయంలో నేను జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాను.
ప్ర: తొలి చిత్రం ఇదు ఎన్న మాయం నిరాశపరచడంతో రాశిలేని నటి అనే ప్రచారం జరగడం గురించి మీ స్పందన?
జ: సినిమాలోనే కాదు ఏ రంగంలోనైనా విజయం చాలా ముఖ్యం. ఇక ఇక్కడ అలాంటి విజయం ఇక్క హీరోయిన్ చేతిలోనే ఉంటుందని నేను అనుకోను. సినిమా అన్నది సమష్టి కృషి అని నేనిప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అందరి సరైన భాగస్వామ్యంతోనే విజయం సాధ్యం అవుతుంది.అయితే ఎందుకనోగానీ రాశి అనే సెంటిమెంట్ హీరోయిన్లనే బాగా బాధింపునకు గురి చేస్తోంది.
ప్ర: తమిళంతో పాటు తెలుగులోనూ విజయాన్ని అందుకున్నారు. అభిమానుల్ని పెంచుకుంటున్నారు. వారి నుంచి ప్రేమలేఖలు వస్తున్నాయా?
జ: ప్రేమలేఖలు అని చెప్పనుగానీ ఉత్తరాల ద్వారా గానీ, ప్రత్యక్షంగా కలిసినప్పుడు గానీ అభిమానులు చాలా ప్రేమాభిమాలను కురిపిస్తున్నారు.పక్కింటి అమ్మాయిలా చాలా అందంగా ఉన్నావంటూ అభినందిస్తున్నారు.మా అమ్మ పెద్ద నటి కావడం వల్ల తన అనుభవం నా నటనకు మంచి బాటలు వేస్తోంది.
ప్ర: మీ వాయిస్ చాలా బాగుంది
జ: థ్యాంక్స్.నాకు తమిళ భాష బాగా తెలుసు. అందుకే నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు.
ప్ర: ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?
జ: బాబీసింహాకు జంటగా పాంబుసండై, ప్రభుసాలమన్ దర్శకత్వంలో ధనుష్ సరసన నటిస్తున్న చిత్రంతో పాటు శివకార్తికేయన్‌తో మరో చిత్రం చేస్తున్నాను. విజయ్‌కు జంటగా నటించనున్నట్లు మీడియా ప్రచారం హోరెత్తిస్తోంది. నిజానికి ఆ విషయం నాకే తెలియదు. విజయ్‌తో నటించే అవకాశం వస్తే సంతోషమే.
ప్ర: ఏ అంశాల వారిగా చిత్రాలను ఎంపిక చేసుకుంటారు?
జ: మొదట కథ నచ్చాలి. అదే సమయంలో కూడా ఎవరెవరు పని చేస్తున్నారన్నది ముఖ్యం.
ప్ర: ఏ హీరోకు జంటగా నటించాలని ఆశ పడుతున్నారు?
జ: ఇంకెవరు అజిత్‌తోనే.