
హాలీవుడ్ తరహాలో ఉంది : సుకుమార్
‘‘ట్రైలర్ బాగుంది. హాలీవుడ్ తరహాలో ఈ చిత్రం ఉంటుందనిపిస్తోంది. నిఖిల్ నటనలో గాఢత కనిపించింది’’ అని దర్శకుడు సుకుమార్ అన్నారు. నిఖిల్, రీతూవర్మ, ఈషా గోపికర్ ముఖ్య తారలుగా సుధీర్ వర్మ దర్శకత్వంలో దేవాంశ్ నామా సమర్పణలో అభిషేక్ నామా నిర్మించిన ‘కేశవ’ టీజర్‌ను సుకుమార్ విడుదల చేశారు. నిఖిల్ మాట్లాడుతూ– ‘‘నా కెరీర్ డౌన్‌ఫాల్‌లో ఉన్నప్పుడు ‘స్వామిరారా’ వంటి హిట్ ఇచ్చిన సుధీర్ వర్మ ఇప్పుడు సరికొత్త కథతో ‘కేశవ’ తీశాడు’’ అన్నారు. ఇంకా సుధీర్ వర్మ, అభిషేక్ నామా పాల్గొన్నారు.