ఆ ఇద్దరు.. వీరే.. వీరే..వీరే! | kona venkat reveals two directors names | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరు.. వీరే.. వీరే..వీరే!

Published Sun, Oct 29 2017 6:45 PM | Last Updated on Sun, Oct 29 2017 6:58 PM

kona venkat reveals two directors names

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తాజా సినిమా 'జైలవకుశ'.. బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను అంగీకరించడానికి కారణం ఇద్దరు వ్యక్తులు అని, సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత వారి పేర్లు వెల్లడిస్తానని ఎన్టీఆర్‌ ప్రీరిలీజ్‌ వేడుకలో ప్రకటించాడు. అన్నట్టుగానే 'జైలవకుశ' ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేసిన జూనియర్‌కూ మంచి పేరు వచ్చింది. మరి ఈ సినిమాను ఎన్టీఆర్‌ చేయడానికి కారణమైన ఆ ఇద్దరు ఎవరంటే.. ఎస్‌ఎస్‌ రాజమౌళి, కొరటాల శివ... ఈ టాప్‌ డైరెక్టర్లే ఎన్టీఆర్‌ 'జైలవకుశ' చేయడానికి కారణం. ఈ విషయాన్ని ప్రముఖ మాటల రచయిత కోన వెంకట్‌ తాజాగా ట్విట్టర్‌లో వెల్లడించారు.

ప్రిరిలీజ్‌ వేడుకలో ఎన్టీఆర్‌ ఇచ్చిన మాటను గుర్తుచేస్తూ ఓ నెటిజన్‌ రిక్వెస్ట్‌ చేయడంతో కోన వెంకట్‌ ఈ ఇద్దరు పేర్లను వెల్లడించారు. నిజానికి ఎస్ఎస్‌ రాజమౌళి ఎన్టీఆర్‌కు సన్నిహితుడు. ఎస్‌ఎస్‌ రాజమౌళి, వీ వినాయక్‌లు తనకు సన్నిహితులు అని ఎన్టీఆర్‌ చెప్తుంటారు. 'జైలవకుశ' ఎన్టీఆర్‌ చేయడం వెనుక ఆ ఇద్దరు ఉండి ఉండొచ్చునని భావించారు. కానీ వినాయక్‌ ప్లేస్‌లో కొరటాల శివ వచ్చాడు. ఎన్టీఆర్‌కు 'జనతా గ్యారేజ్‌' వంటి భారీ విజయాన్ని అందించిన కొరటాల శివతోనూ ఎన్టీఆర్‌ మంచి స్నేహబంధం కలిగి ఉన్నాడని సినీ వర్గాలు అంటున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement