
భరత్ అనే నేను చిత్రంలోని ఓ స్టిల్.. పక్కన దర్శకుడు కొరటాల
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను చిత్రం గురించి ఆ మధ్య కొన్ని కథనాలు వినిపించాయి. ముఖ్యంగా ఈ సినిమా కథ గురించి. ఇది కొరటాల శివ సొంతం కాదని.. రూ. కోటి ఇచ్చి వేరే రచయిత దగ్గరి నుంచి కథను కొనుగోలు చేశాడని వాటి సారాంశం. అయితే ఆ కథనాలపై తాజాగా ఆయన చిత్ర ప్రమోషన్‌లలో స్పందించారు. అదంతా రూమర్ అని కొట్టిపడేశారు. పనిలో పనిగా కథను ఎలా సిద్ధం చేసిందన్నది ఆయన చెప్పుకొచ్చారు.
‘నా స్నేహితుడు, కెరీర్ తొలినాళ్లల్లో నా రూమ్‌మేట్ అయిన శ్రీహరి(దర్శకుడు) అప్పట్లో నాకు ఓ ఐడియా ఇచ్చాడు. హీరో ముఖ్యమంత్రి పాత్ర.. అంటూ అతను ఇచ్చిన ఆలోచన అద్భుతంగా ఉంది. అది నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత ఆ లైన్‌ను నేను డెవలప్ చేసుకుని కథను సిద్ధం చేశా. ఇది పూర్తిగా నా సొంత కథ. అయినప్పటికీ ఐడియా మాత్రం నా స్నేహితుడిదే. అందుకే టైటిల్ కార్డులో స్పెషల్ థ్యాంక్స్ చెబుతూ అతని పేరు కూడా వేయిస్తున్నా’ అని కొరటాల స్పష్టం చేశారు. మహేష్ బాబు-కైరా అద్వానీ జంటగా నటిస్తున్న భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment