కొరటాలతో మళ్లీ? | Koratala Siva's next Mahesh Babu | Sakshi
Sakshi News home page

కొరటాలతో మళ్లీ?

Published Thu, Jul 21 2016 12:30 AM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

కొరటాలతో మళ్లీ?

కొరటాలతో మళ్లీ?

 ఊరు మనకు చాలా ఇచ్చింది. తిరిగివ్వకపోతే లావైపోతాం - ‘శ్రీమంతుడు’ సినిమాలోని ఈ ఫేమస్ డైలాగ్ అందరికీ తెలిసిందే. కేవలం డైలాగ్ మాత్రమే కాదు.. ‘శ్రీమంతుడు’ సినిమా థీమ్ ఇది. స్తోమత ఉన్నవాళ్లు తమ జీవితానికి ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చిన ఊరును దత్తత తీసుకోవాలనే మంచి కాన్సెప్ట్‌తో తీసిన సినిమా.
 
  తన కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అని మహేశ్‌బాబు పలు సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే. కమర్షియల్ యాంగిల్‌లో మంచి సినిమా తెరకెక్కించిన దర్శకుడు కొరటాల శివకూ పేరొచ్చింది. ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోందని సమాచారం. ఈ చిత్రాన్ని ఓ పేరున్న ప్రొడ్యూసర్ నిర్మిస్తారని తెలుస్తోంది.
 
  ‘శ్రీమంతుడు’ లాంటి కాన్సెప్ట్ కథతోనే మహేష్ - కొరటాల కొత్త సినిమా కూడా ఉండబోతోందట! ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబు సినిమా చేస్తుండగా, ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు కొరటాల శివ. మురుగదాస్ సినిమా తర్వాత కమిట్ అయిన ప్రాజెక్టుల లిస్టు పెద్దదే ఉన్నా... కొరటాల సినిమాకే ఆసక్తి చూపిస్తున్నారట మహేశ్‌బాబు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement