నిఖిల్ కూడా గిఫ్ట్ ఇచ్చాడు | nikhil gifts a bike to his assistant | Sakshi
Sakshi News home page

నిఖిల్ కూడా గిఫ్ట్ ఇచ్చాడు

Published Sun, Mar 6 2016 11:54 AM | Last Updated on Sun, Sep 3 2017 7:09 PM

నిఖిల్ కూడా గిఫ్ట్ ఇచ్చాడు

నిఖిల్ కూడా గిఫ్ట్ ఇచ్చాడు

టాలీవుడ్ హీరోలు తమ అభిమానాన్ని గిఫ్ట్ల రూపంలో చూపిస్తున్నారు. అయితే ఇటీవల కాలం సినిమా మార్కెట్ భారీగా పెరగటంతో గిఫ్ట్ల రేంజ్ కూడా అదే స్థాయిలో పెరిగింది. శ్రీమంతుడు లాంటి హిట్ ఇచ్చినందుకు దర్శకుడు కొరటాల శివకి కారును గిఫ్ట్గా ఇచ్చాడు మహేష్ బాబు. అదే దర్శకుడితో సినిమా చేస్తున్న ఎన్టీఆర్ కూడా ఓ కాస్ట్లీ వాచ్ను కొరటాలకు గిఫ్ట్ ఇచ్చాడు. ఇలా తమ ఆనందాన్ని గిఫ్ట్ల రూపంలో పంచుకుంటున్నారు స్టార్స్.

తాజాగా ఇదే లిస్ట్లో మరో యంగ్ హీరో కూడా చేరిపోయాడు. తన దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న వ్యక్తి కోసం ఓ బైక్ను కొనిచ్చాడు యంగ్ హీరో నిఖిల్. అంతేకాదు తానే ఆ బైక్ మీద కూర్చొని ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇటీవల శంకరాభరణం సినిమాతో నిరాశపరిచిన నిఖిల్ ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ ఫాంటసీ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్కు రెడీ అవుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement