
‘‘పదహారేళ్లకే ఇండస్ట్రీకి వచ్చాను. వచ్చినప్పటి నుంచే బ్రేక్ లేకుండా నటించాల్సింది. ఇండస్ట్రీకి ఎర్లీగా వచ్చి ఎర్లీగా దూరం అయ్యాను’’ అన్నారు ల„Š . రమేశ్ కుడుముల దర్శకత్వంలో ల„Š చదలవాడ, దిగంగనా సూర్యవంశీ జంటగా పద్మావతి చదలవాడ నిర్మించిన ‘వలయం’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ల„Š చెప్పిన విశేషాలు.
► చెల్డ్ ఆర్టిస్టుగా మూడు, హీరోగా నాలుగు సినిమాలు చేశాను. ‘నీతో వస్తా’ నా మొదటి సినిమా. ఆ నెక్ట్స్ 786, మేస్త్రీ, శంకర్ సినిమాలు చేశాను. ఆ తర్వాత సింగపూర్ వెళ్లి ఎంబీఏ చేసి దాదాపు 13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాను. ‘వలయం’ వంటి మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాలోని పాత్ర కోసం దాదాపు ఇరవై కేజీల బరువు తగ్గాను.
► ‘బిచ్చగాడు’ సినిమాతో నిర్మాతగా మారాను. ఈ రోజుల్లో చిన్న సినిమాలు విడుదల చేయడం కష్టం. సినిమా బాగుంటేనే ప్రేక్షకుల అటెన్షన్ ఉంటుంది. నిర్మాతగా చేయడం కన్నా కూడా హీరోగా నటించడమే కాస్త కష్టంగా అనిపించింది.
► దిశ సంఘటనకు, ‘వలయం’ చిత్రానికి సంబంధం లేదు. డైరెక్టర్ స్క్రిప్ట్ రాసినప్పుడే దిశ పేరు రావడం జరిగింది. అలాంటి సున్నితమైన సంఘటనను సినిమా ప్రచారానికి వాడుకున్నట్లు ఉంటుందని హీరోయిన్ పేరు మార్చాలని ప్రయత్నించాం. కానీ డబ్బింగ్‌లో లిప్ సింక్ కాకపోవడంతో అదే పేరు కొనసాగించాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment