నవ్విస్తూ భయపెడతా... నాలుగోసారి | Lawrence gets ready for Muni 4 | Sakshi
Sakshi News home page

నవ్విస్తూ భయపెడతా... నాలుగోసారి

Published Mon, Aug 28 2017 12:22 AM | Last Updated on Sun, Sep 17 2017 6:01 PM

నవ్విస్తూ భయపెడతా... నాలుగోసారి

నవ్విస్తూ భయపెడతా... నాలుగోసారి

ఒకటోసారి... ‘ముని’. రెండోసారి... ‘కాంచన’. మూడోసారి... ‘గంగ’. ఇప్పటివరకు హారర్‌ కామెడీ ‘ముని’ సిరీస్‌లో మూడు సిన్మాలొచ్చాయి. రాఘవా లారెన్స్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ మూడూ ప్రేక్షకులను నవ్వించాయి, భయపెట్టాయి. ఓ రకంగా చెప్పాలంటే హారర్‌ కామెడీ సిన్మాల్లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచాయి.

ఇప్పుడు నాలుగోసారి ప్రేక్షకులను నవ్విస్తూ, భయపెట్టడానికి రాఘవా లారెన్స్‌ రెడీ అయ్యారు. ప్రస్తుతం ‘ముని–4’ స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. వచ్చే నెలలో చిత్రీకరణ ప్రారంభించనున్నారు. ‘‘ప్రస్తుతం కథకు కీలకమైన ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ రాస్తున్నా. ‘కాంచన’లో ట్రాన్స్‌జెండర్స్‌ సమస్యలను చూపినట్టు ఇందులో ఓ సోషల్‌ ఇష్యూను ప్రస్తావిస్తా. ఇందులో ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువమంది హీరోయిన్లు నటిస్తారు’’ అని రాఘవా లారెన్స్‌ పేర్కొన్నారు.

దెయ్యంగా కాజల్‌?!
‘ముని–4’లో కాజల్‌ నటిస్తారట. అదీ దెయ్యంగా! చెన్నై కోడంబాక్కమ్‌లో ఇప్పుడిదే హాట్‌ టాపిక్‌. రాఘవా లారెన్స్‌కు జోడీగా నటించమని కాజల్‌ అగర్వాల్‌కు ఓ ఆఫర్‌ వచ్చిన మాట వాస్తవమే. అయితే... ‘ముని–4’ కోసం ఆమెను అడగలేదు. రాజమౌళి శిష్యుడు మహదేవ్‌ దర్శకత్వంలో లారెన్స్‌ హీరోగా నటించే సినిమా కోసం సంప్రదించారు. నిజం చెప్పాలంటే... ఈపాటికే ఆ సినిమా మొదలవ్వాలి.

విజువల్‌ ఎఫెక్ట్స్‌ బేస్డ్‌ సిన్మా కావడంతో ప్రీ–ప్రొడక్షన్‌ వర్క్‌కు టైమ్‌ తీసుకుంటున్నారు. అందువల్ల, ‘ముని–4’ ముందుకొచ్చింది. ఒకవేళ ఈ సినిమాలో కాజల్‌ నటిస్తే అందమైన దెయ్యంగా కనిపిస్తారట! మహదేవ్‌ సినిమాకు రాజమౌళి తండ్రి వి. విజయేంద్రప్రసాద్‌ కథ అందిస్తున్నారు. ఆ సంగతలా ఉంచితే.. ఒకవేళ ‘ముని–4’లో నటిస్తే? మహదేవ్‌ దర్శకత్వంలో లారెన్స్‌ హీరోగా రూపొందనున్న చిత్రంలోనూ కాజల్‌ నటిస్తారా? వెయిట్‌ అండ్‌ సీ!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement