ఎరవాడ జైల్లో సాంగ్ లాంచ్ | Lucknow Central's Song Launched At Yerwada Central Jail | Sakshi
Sakshi News home page

ఎరవాడ జైల్లో సాంగ్ లాంచ్

Published Thu, Aug 17 2017 10:42 AM | Last Updated on Sun, Sep 17 2017 5:38 PM

ఎరవాడ జైల్లో సాంగ్ లాంచ్

ఎరవాడ జైల్లో సాంగ్ లాంచ్

నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన మరో బాలీవుడ్ మూవీ లక్నో సెంట్రల్‌. ఫర్హాన్ అక్తర్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాకు రంజిత్ తివారీ దర్శకుడు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని విభిన్నంగా నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ పాటను ఎరవాడ జైల్లో రిలీజ్ చేశారు.

తీన్ కబూతర్ అంటూ సాగే ఈ పాటకు చిత్రయూనిట్ పాటు జైల్ లోని 300 మంది ఖైదీలు కూడా డ్యాన్స్ చేయటం విశేషం. అంతేకాదు సినిమాను కూడా జైల్లో ప్రదర్శించేందుకు అనుమతి కోరినట్టుగా నటుడు ఫర్హాన్ అక్తర్ వెల్లడించారు. ఇప్పటికే ఎరవాడ అదనపు డీజీపీ భూషణ్ కుమార్ తో ఈ విషయం పై చర్చించామని, ఆయన ఉన్నతాధికారులతో ఈ విషయాన్ని చరిస్తామన్నారని తెలిపారు. లక్నో సెంట్రల్ సినిమాను సెప్టెంబర్ 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement