మాగంటి శ్రీనాథ్
‘‘నాన్నా నేను సినిమాల్లోకెళ్తా’ అని తల్లిదండ్రులను అడగటం ఎవరి విషయంలో అయినా కామన్‌గా జరిగేదే. కానీ నా విషయంలో మాత్రం రివర్స్‌లో జరిగింది. ‘నానా.. సినిమాల్లోకి వెళ్తావా?’ అని మా నాన్నగారే అడిగారు. నాకూ సినిమాల మీద ఆసక్తి ఉండటంతో సినిమాల్లోకి వచ్చాను’’ అన్నారు మాగంటి శ్రీనాథ్. అతను నటించిన లేటెస్ట్ చిత్రం ‘బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్. మహంకాళి శ్రీనివాస్ నిర్మాణంలో నాగసాయి మాకం దర్శకత్వం వహించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ సంపాదించింది. అలాగే థియేటర్స్ సంఖ్య కూడా పెరిగిందన్నారు మాగంటి శ్రీనాథ్. ఈ సందర్భంగా శ్రీనాథ్ చెప్పిన విశేషాలు.
► ‘బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్’ రెస్పాన్స్ గురించి?
చాలా బావుంది. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్ కూడా పెంచుతున్నామంటే అర్థం చేసుకోవచ్చు. టీమ్ అంతా హ్యాపీగా ఉన్నాం. కథ బాగుందని చూసినవాళ్లు అంటున్నారు. ఒక ఊర్లో ఓ పోలీస్‌స్టేషన్. అక్కడ నమోదయ్యే గమ్మతు కేసులు ఆధారంగా ఈ కథ నడుస్తుంది. మా సినిమాలో చేసిన హీరోయిన్ తెలుగమ్మాయి. తను ‘సైరా’లో ఓ పాత్ర చేసింది. ‘ఎదురీత’లో చేసింది.
► ఇందులో చేసిన పోలీస్ పాత్రకు శిక్షణ ఏమైనా?
లేదు. ఎన్‌సీసీలో నాకు ఏ, బి సర్టిఫికేట్‌లు ఉన్నాయి. మా అమ్మగారు గవర్నమెంట్ స్కూల్ టీచర్. ఆమె స్టూడెంట్స్‌లో కొంత మంది పోలీస్‌లు ఉన్నారు. వాళ్ల ఇన్‌పుట్స్ ఉపయోగపడ్డాయి. పోలీస్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, వెపన్స్‌ను ఎలా హ్యాండిల్ చేయాలనేవి క్షుణ్ణంగా తెలుసుకున్నాను.
► హీరో అవ్వాలనే ఆలోచన ఎప్పుడు మొదలైంది?
నేను మెకానికల్ ఇంజనీర్‌ని. కాలేజ్ టైమ్‌లో టీచర్స్ చెప్పిన కాన్సెప్ట్‌లు అర్థం కానప్పుడు ఆ సినిమాలో నేను హీరో అయితే ఏంటి? ఇక్కడ నేనుంటే ఇలా చేసేవాణ్ణి అన్నట్టుగా ఆలోచించేవాణ్ణి. బయటకు మాత్రం బుద్ధిగా క్లాస్ వింటున్నట్టు కనిపించేవాణ్ణి. కాలేజ్ పూర్తయ్యాక నాన్నగారి బిజినెస్‌ను టేకప్ చేశాను. ఓ రోజు నాన్నే సడన్‌గా ‘సినిమాల్లో హీరోగా చేయి’ అన్నారు. నాకూ ఇంట్రస్ట్ కాబట్టి వెంటనే ‘యస్’ అన్నాను. సత్యానంద్‌గారి వద్ద శిక్షణ తీసుకున్నాను. ఆ తర్వాత ‘ఇదేం దెయ్యం’ అనే సినిమాలో నటించాను.
► ప్రస్తుతం ఏం సినిమాలు చేస్తున్నారు?
‘సమయం’ రిలీజ్‌కు రెడీ అయింది. నితిన్‌తో ‘ద్రోణ’ తీసిన కుమార్‌గారితో ఓ మూవీ చేశా.
► డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా?
రైతులా నటించాలనుంది. మన దేశానికి రైతే వెన్నెముక. కానీ అలాంటి రైతుల పరిస్థితి ప్రస్తుతం బాగాలేదు. రైతుల ఎమోషన్స్‌తో కూడుకున్న కథ వస్తే కచ్చితంగా చేస్తాను. అన్ని రకాల సినిమాలు చేసి, నటుడిగా నిరూపించుకోవాలని ఉంది.
Comments
Please login to add a commentAdd a comment