‘నువ్వు ఎంత ప్రత్యేకమో చెప్పేందుకు మరో కారణం’ | Mahesh Babu Birthday wishes to namrata | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 22 2018 10:05 AM | Last Updated on Mon, Jan 22 2018 1:33 PM

Mahesh Babu Birthday wishes to namrata - Sakshi

సూపర్‌ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రత శిరోద్కర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆసక్తికరమైన ట్వీట్‌తో శుభాకాంక్షలు తెలియజేశాడు. ‘నువ్వు ఎంత ప్రత్యేకమో చెప్పేందుకు మరో కారణం, నా భార్య, నా స్నేహితురాలు, నా ప్రేమకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశాడు మహేష్‌. వంశీ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్‌ గా నటించిన నమ్రతతో షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డాడు సూపర్‌ స్టార్‌.

తరువాత కుటుంబ సభ్యుల అంగీకారంతో ఒక్కటైయ్యారు. పెళ్లి తరువాత సినిమాలకు పూర్తిగా దూరమైన నమ్రత కుటుంబ బాధ్యతలతో పాటు మహేష్ బాబుకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు. అంతేకాదు మహేష్ బాబు వ్యక్తిగత పర్యటనలకు సంబంధించిన అప్‌డేట్స్‌ ఫొటోలతో అభిమానులను ఖుషీ చేస్తుంటారు. ఈ రోజు నమ్రత పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భరత్‌ అనే నేను సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. కైరా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement