మహేశ్‌బాబు అంటే ఇష్టం!
‘‘తెలుగు సినిమాల్లో నటించాలని ప్రయత్నించినపుడు అవకాశాలు లభించలేదు. హిందీలో బిజీగా మారిన తర్వాత అవకాశాలు కుప్పలుతె ప్పలుగా వచ్చాయి. కానీ, సమయం చిక్కడంలేదు’’ అని బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనె అన్నారు. ‘ఫైండింగ్ ఫెనీ’ చిత్రం ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో హీరో అర్జున్ కపూర్, దర్శకుడు హోమీతో కలిసి సందడి చేశారు దీపికా. ఈ సందర్భంగా... తెలుగు చిత్ర పరిశ్రమలో మహేశ్‌బాబు అంటే తనకు ఇష్టం అని దీపిక ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. తాను హీరోయిన్‌గా స్థిరపడకముందు హైదరాబాద్‌లో ఎన్నో షోలు, ష్యాషన్ ఈవెంట్లలో పాల్గొన్నానని ఆమె తెలిపారు. తన తొలి యాడ్ షూటింగ్ కూడా హైదరాబాద్‌లో జరిగిన విషయాన్ని దీపికా గుర్తు చేసుకున్నారు.