‘భరత్ అనే నేను’ లాంటి సూపర్‌హిట్ తరువాత సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ‘మహర్షి’. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్, పోస్టర్,సాంగ్స్‌తో హైప్‌ను క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
ఈ విషయమై మహేష్ బాబు ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఇంతటితో మహర్షి షూటింగ్ పూర్తయింది. ఇక మే 9న థియేటర్‌లో కలుసుకుందాం అంటూ ట్వీట్ చేశారు. ఇక షూటింగ్ పూర్తయిన సందర్భంలో చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.
With this... It's a wrap!!! See you in the cinemas on May 9th 😊😊😊#Maharshi #MaharshionMay9th https://t.co/ktlKfOJaX8
— Mahesh Babu (@urstrulyMahesh) April 17, 2019
Comments
Please login to add a commentAdd a comment