నటుడు కళాశాల బాబు (ఫైల్ ఫొటో)
ప్రముఖ మలయాళ నటుడు కళాశాల బాబు(63) కన్నుమూశారు. ఆదివారం రాత్రి ఎర్నాకుళంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సన్నిహితులు వెల్లడించారు. గత కొన్ని నెలలుగా గుండె, మెదడు సంబంధిత సమస్యలతో ఆయన సతమతమవుతున్నారు. ఈ క్రమంలో కొచ్చిలోని అమృతా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న కళాశాల బాబు కన్నుమూశారు. బాబు మరణంతో మలయాళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల మలయాళ ఇండస్ట్రీ సంతాపం ప్రకటించింది. ఆయన కుటుంబానికి పలువురు నటీనటులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
50కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. ఆయన ప్రముఖ నటులు దిలీప్, మోహన్‌లాల్, మమ్ముట్టి, పృథ్వీరాజ్ మూవీల్లో కీలక పాత్రలు పోషించారు. కస్తూరిమన్, లయన్ మూవీలతో గుర్తింపు పొందారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గానూ నటనలో రాణించారు. కథాకలిలో ఫేమస్ అయిన కళామండలం కృష్ణన్ నాయర్, మోహినీఅట్టంలో ప్రసిద్ధిగాంచిన కల్యాణికుట్టి అమ్మ సంతానమే కళాశాల బాబు.
వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఆయన అనంతరం బుల్లితెరపై కనిపించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. కళాశాల బాబుకు భార్య లలిత, ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు శ్రీదేవి అమెరికాలో నివాసం ఉంటుండగా, కుమారుడు విశ్వనాథన్ ఐర్లాండ్‌లో స్థిరపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment