మలయాళ మల్లెతీగ | Malle Teega movie audio launched | Sakshi
Sakshi News home page

మలయాళ మల్లెతీగ

Published Mon, Dec 16 2013 2:22 AM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM

మలయాళ మల్లెతీగ - Sakshi

మలయాళ మల్లెతీగ

జాతీయ ఉత్తమ దర్శకుడు బ్లెస్సీ దర్శకత్వంలో శ్వేతామీనన్ నటించిన మలయాళ చిత్రం ‘కలిమన్ను’ తెలుగులో ‘మల్లెతీగ’గా అనువాదమవుతోంది. బొడ్డు దేవికిరణ్ అనువదిస్తున్న ఈ చిత్రం పాటల్ని పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న దర్శక నిర్మాత సునీల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ -‘‘లైవ్ ప్రెగ్నెన్సీ అనేది ఇప్పటి వరకూ ఎవరూ చేయని సాహసం. ఇందులో శ్వేతామీనన్‌తో చేయించారు’’ అని చెప్పారు. మాతృత్వపు మాధుర్యాన్ని తెలిపే చిత్రమిదని దేవికిరణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా శివకృష్ణ, బొడ్డు చంద్రశేఖర్‌రావు, చిన్నా, సుబ్బు, శివగణేష్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement