'సూపర్ స్టార్ ను డైరెక్ట్ చేయాలకున్నా'
తిరువనంతపురం: తన దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సినిమా తీయాలనుకున్నానని మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వెల్లడించారు. 1997లో వచ్చిన 'భూతక్కన్నడీ' సినిమాను రజనీ హీరోగా తెరకెక్కించాలకున్నట్టు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమా కథ ఆయనకు వినిపించానని, అయితే కార్యరూపం దాల్చలేదని మమ్ముట్టి గుర్తు చేసుకున్నారు. తర్వాత ఈ సినిమాను లోహితదాస్ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కించాడు. ఈ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా ఆయన జాతీయ అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ కథానాయకుడిగా మమ్ముట్టికి ఫిల్మ్ ఫేర్ పురస్కారం తెచ్చిపెట్టింది.
మణిరత్నం తెరకెక్కించిన దళపతి సినిమాలో రజనీకాంత్ తో కలిసి మమ్ముట్టి నటించారు. దురోధ్యన, కర్ణుడి స్నేహం స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో ఘనవిజయాన్ని సాధించింది. రజనీకాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో '2.0' సినిమాలో నటిస్తున్నారు. దీని తర్వాత 'కబాలి' దర్శకుడు రారంజిత్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నారు.