12 కిలోలు తగ్గిన మనోజ్‌ | manchu manoj in Velupillai Prabhakaran caractor okkadu migiladu | Sakshi
Sakshi News home page

12 కిలోలు తగ్గిన మనోజ్‌

Published Thu, Apr 6 2017 11:43 PM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM

12 కిలోలు తగ్గిన మనోజ్‌

12 కిలోలు తగ్గిన మనోజ్‌

లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలం (ఎల్‌.టి.టి.ఈ) చీఫ్‌ వేలు పిళ్లై ప్రభాకరన్‌ గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు. శ్రీలంక యుద్ధంలో ప్రభాకరన్‌ పాత్ర ఏంటి? ప్రభాకరన్‌ మరణానికి దారి తీసిన పరిస్థితులేంటి? అన్న విషయాలు తెలుసుకోవాలంటే మా చిత్రం చూడాలంటున్నారు దర్శకుడు అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి. ప్రభాకరన్‌ జీవిత కథ నేపథ్యంలో మంచు మనోజ్‌ హీరోగా ఎస్‌.ఎన్‌ రెడ్డి, లక్ష్మీకాంత్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. అనీషా ఆంబ్రోస్‌ కథానాయిక.

ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మంచు మనోజ్‌ ఈ చిత్రంలో డ్యూయెల్‌ రోల్‌ చేస్తున్నారు. అందులో స్టూడెంట్‌ పాత్ర కోసం 12 కేజీల బరువు తగ్గారు. 1990 కాలం నాటి శ్రీలంక యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది. చిత్రం ఫస్ట్‌ లుక్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దర్శకుడు అజయ్‌ ఆండ్రూస్‌ అద్భుతంగా తెరకెక్కిస్తు న్నారు’’ అన్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ ప్లే: గోపీమోహన్, సంగీతం: శివ నందిగామ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement