డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’ | Manmadhudu 2 Post Production Work On Full Swing | Sakshi
Sakshi News home page

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

Published Tue, Jul 16 2019 4:34 PM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

Manmadhudu 2 Post Production Work On Full Swing - Sakshi

కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘మ‌న్మథుడు 2’. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్(జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాహుల్ ర‌వీంద్రన్ ద‌ర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడ‌క్షన్ కార్యక్రమాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

అందులో భాగంగా హీరో నాగార్జున డ‌బ్బింగ్ చెబుతున్నారు.  అన్ని కార్యక్రమాల‌ను పూర్తి చేసి సినిమాను ఆగ‌స్ట్ 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే అవంతికగా న‌టించిన ర‌కుల్ ప్రీత్ సింగ్ పాత్రకు సంబంధించిన టీజీర్‌ను విడుద‌ల చేశారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో విడుద‌ల‌, ట్రైల‌ర్ రిలీజ్ డేట్లను త్వర‌లోనే వెల్లడించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement